Share News

కార్యదర్శులు డబ్బులు వసూలు చేస్తే కఠినచర్యలు

ABN , Publish Date - Feb 02 , 2026 | 11:56 PM

పంచాయతీ కార్యదర్శులు ప్రతీ పనికి డబ్బులు వసూలు చేస్తున్నా రని ఫిర్యాదులు వస్తున్నాయని, పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష హెచ్చరించారు.

 కార్యదర్శులు డబ్బులు వసూలు చేస్తే కఠినచర్యలు

ఫైల్‌ నం.01పిడిపి కల్చరల్‌2

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ శ్రీహర్ష (01పిడిపి కల్చర్‌2)

కార్యదర్శులు డబ్బులు వసూలు చేస్తే కఠినచర్యలు

సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ శ్రీహర్ష

పెద్దపల్లి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ కార్యదర్శులు ప్రతీ పనికి డబ్బులు వసూలు చేస్తున్నా రని ఫిర్యాదులు వస్తున్నాయని, పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మం దిరంలో కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామాలకు ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిందని, వీటిని వినియోగించు కుంటూ గ్రామాలలో పారిశుధ్య పనులు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. రోడ్లపై చెత్త, ప్లాస్టిక్‌ ఉండటానికి వీలులేదని అన్నారు. మల్టీపర్పస్‌ వర్కర్లను పూర్తిస్థాయిలో వినియోగించు కుంటూ చెత్త సేకరణ జరగాలన్నారు. సెగ్రిగేషన్‌ షెడ్‌ లను వినియోగించాలన్నారు. రోడ్లపై నీరు నిల్వ ఉండ డానికి వీలు లేదని, రోడ్డు పక్కన పిచ్చి మొక్కలు ఉంటే తొలగించాలని అన్నారు. గ్రామ పంచాయతీలలో భవన నిర్మాణాలు, లేఔట్‌ లకు అనుమతులు నిబంధ నల ప్రకారం జారీ కావాలని, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకోవా లన్నారు. లేఔట్‌ అనుమతులను సకాలంలో డిస్పోజ్‌ చేయాలని, నిబంధనలు పాటించని పక్షంలో తిరస్కరిం చాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యా సం స్థలు, అంగన్‌వాడీలలో తాగునీటి నాణ్యతను వారానికి ఒకసారి పరిశీలించాలని, అవసరమైన చోట అందు బాటులో ఉన్న నిధులతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. సకాలంలో ఇందిరమ్మ ఇళ్ల పనులను ఆరంభించకుంటే రద్దు చేయాలని ఆదేశించారు. జడ్పీ సీఈవో నరేందర్‌, డీఆర్‌డీఓ కాళిందిని, హౌసింగ్‌ పీడీ రాజేశ్వర్‌, ఎంపీడీవోలు, డీఎల్‌పీఓ దేవకీ దేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ప్రాథమిక సామర్థ్యాలు తప్పనిసరి

పెద్దపల్లి కల్చరల్‌, (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ప్రాథమిక సామర్థ్యాలు తప్పనిసరని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో ఎఫ్‌ఎల్‌ఎన్‌ అమలుపై సమీక్ష నిర్వహిం చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులం దరికి ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానంపై పూర్తి పట్టు ఉండాలన్నారు. 3వ తరగతి పూర్తయ్యే నాటికి ప్రతీ విద్యార్థి చదవడం, రాయడం, కూడికలు, తీసివేతలు గణిత సామర్థ్యాలను సాధించేలా ఉపాధ్యా యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఎంఈఓలు, కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్లు క్రమం తప్ప కుండా పాఠశాలలను సందర్శించాలని, ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమం అమలవుతున్న తీరును నిరంతరం పర్య వేక్షించాలన్నారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు అర్థమ య్యేలా టీఎల్‌ఎంను వినియోగించుకొని పాఠశాలలో విద్యార్థుల హాజరుశాతం పెరిగేలా చర్యలు చేపట్టాల న్నారు. జిల్లా విద్యాధికారి శారద, అకడమిక్‌ మానిట రింగ్‌ అధికారి షేక్‌, ఎంఈఓలు, కాంప్లెక్స్‌ ప్రధానో పాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 12:01 AM