సమ్మక్క జాతర ఆదాయం రూ.57.74లక్షలు
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:57 PM
గోదా వరిఖని సమ్మక్క-సారలమ్మ జాతరకు ఈ ఏడాది రూ.57.74లక్షల ఆదాయ సమకూ రింది. ఆదివారం సారలమ్మ దేవాలయం హాల్‌లో హుండీల లెక్కించారు. 44హుండీల ద్వారా రూ.31,26,324 ఆదాయం సమకూ రింది. గతేడాది రూ.29,44,489 ఆదాయం సమకూరగా ఈసారి రూ.1,81,835 అదనపు ఆదాయం సమకూరింది.
కోల్‌సిటీ, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): గోదా వరిఖని సమ్మక్క-సారలమ్మ జాతరకు ఈ ఏడాది రూ.57.74లక్షల ఆదాయ సమకూ రింది. ఆదివారం సారలమ్మ దేవాలయం హాల్‌లో హుండీల లెక్కించారు. 44హుండీల ద్వారా రూ.31,26,324 ఆదాయం సమకూ రింది. గతేడాది రూ.29,44,489 ఆదాయం సమకూరగా ఈసారి రూ.1,81,835 అదనపు ఆదాయం సమకూరింది. వేలం పాటల ద్వారా గతేడాది రూ.13లక్షల ఆదాయం రాగా ఈ ఏడాది రూ.19.89లక్షల ఆదాయం సమకూరింది. టికెట్ల ద్వారా రూ.6,59,560 ఆదాయం సమకూరింది. అదనంగా రెండు గ్రాముల బంగారం, వెండి 790గ్రాములు లభించినట్టు జాతర కమిటీ చైర్మన్ శ్రీని వాసరెడ్డి, ఈవో కాంతారెడ్డి పేర్కొన్నారు. గత జాతర కంటే 8,86,195 అదనపు ఆదా యం సమకూరింది. ఉమ్మడి జిల్లా ఎండో మెంట్ ఏఈ సుప్రియ, డిప్యూటీ తహసీ ల్దార్ లక్ష్మి, శ్రీవెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ కోఆర్డినేటర్ మమత రెడ్డి ఆధ్వర్యంలో 80మంది సేవా సమితి మహిళలు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. మోహన్‌రెడ్డి, బం గారు రాజయ్య పాల్గొన్నారు. సీఐ ఇంద్ర సేనారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ మనోహర్ బందోబస్తు నిర్వహించారు.
రూ.3కోట్ల మద్యం అమ్మకాలు
కోల్‌సిటీ, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): గోదా వరిఖని ఎక్సైజ్ పరిధిలో సమ్మక్క-సారలమ్మ జాతరను పురస్కరించుకుని రూ.3కోట్ల మద్యం అమ్మకాలు అదనంగా జరిగాయి. గతేడాది జనవరిలో రూ.22కోట్ల అమ్మకాలు జరుగగా ఈ ఏడాది రూ.25కోట్ల అమ్మకాలు జరిగాయి. ఇందులో 3200పెట్టెల విస్కీ అదనపు అమ్మకాలు జరుగగా, బీర్లు మా త్రం చలి ప్రభావంతో 2600పెట్టెలు తక్కు వగా అమ్ముడుపోయాయి.