కేసీఆర్‌పై కక్ష సాధింపునకే సిట్ విచారణ
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:55 PM
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడం కక్ష సాధింపేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు. కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయం నుంచి గోదావరిఖని చౌరస్తా వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ చేప ట్టారు.
గోదావరిఖని, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడం కక్ష సాధింపేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు. కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయం నుంచి గోదావరిఖని చౌరస్తా వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ చేప ట్టారు. వారు మాట్లాడుతూ బొగ్గు కుంభకోణాన్ని, జల దోపీడిపై బీఆర్‌ఎస్ చేస్తున్న పోరాటంపై కాంగ్రెస్ సర్కార్ మాజీ సీఎం కేసీఆర్‌పై కక్ష సాధింపులకు పాల్ప డుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని పది సంవత్సరాలు అభివృద్ధి చేసిన కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం దుర్మా ర్గమన్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకున్నదని, సీఎం కేసీఆర్‌ను దెబ్బతీసేం దుకు ముఖ్యమంత్రి కుట్రలు చేస్తున్నారన్నారు. సిట్‌లో ఉన్నది పోలీసులా లేక రేవంత్‌రెడ్డి సైన్యమా అని మండిపడ్డారు. అభివృద్ధి విషయంలో కేసీఆర్‌తో పోటీ పడాలే కానీ విధ్వంసం చేయడం సరైంది కాదని, కేసీ ఆర్ ఎర్రవెళ్లిలో నివాసముంటే నందినగర్‌లో ఎలా నోటీసులు ఇస్తారని నిలదీశారు. ప్రజలు అన్నీ గమని స్తున్నారని, రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు కౌశిక హరి, గోపు ఐలయ్య, పర్లపల్లి రవి, గుంపుల లక్ష్మి, రమ్యయాదవ్, జక్కుల తిరుపతి, సట్టు శ్రీనివాస్, జడ్సన్, బుర్రి వెంకటేష్, కోడి రామకృష్ణ, గుర్రం పద్మ పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్‌ఎస్ నాయకులు దహ నం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకు న్నారు.