• Home » Sircilla

Sircilla

చదువుతోనే ఉన్నత శిఖరాలు అందుకోవచ్చు

చదువుతోనే ఉన్నత శిఖరాలు అందుకోవచ్చు

చదువుతో ఉన్నత శిఖరా లలో ఉంటారని తహసీల్దార్‌ రాపెల్లి రాముడు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ హాస్టల్‌ విద్యార్థులకు ప్రభుత్వం అందించిన మెటీరియల్‌ కార్పెట్‌, బెడ్‌షీట్లు, నోటుబుక్కులు, ప్లేట్లు, గ్లాసులు అందించారు.

సింగరేణి రక్షణకు ప్రత్యక్ష పోరాటం

సింగరేణి రక్షణకు ప్రత్యక్ష పోరాటం

తెలంగాణ కొంగు బంగారంగా పేరుగాంచిన సింగరేణి సంస్థను పరిరక్షించేందుకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నదని ఆ సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. ఆదివారం ఎన్టీపీసీ కాజిపల్లిలోని శ్రీమయి ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన టీజీబీకేఎస్‌ కేంద్ర కమిటీ సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు.

కాళేశ్వరంపై ప్రభుత్వానివి అవగాహన లేని మాటలు

కాళేశ్వరంపై ప్రభుత్వానివి అవగాహన లేని మాటలు

కాళే శ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి, మంత్రులకు కనీస అవగాహ న లేదని, బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రుల బృందం విమర్శించింది. ఆదివారం నందిమేడారం నంది పంప్‌హౌస్‌ను బీఆర్‌ఎస్‌ నాయకులు సందర్శిం చారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు కొప్పుల ఈశ్వర్‌, బోయినిపల్లి వినోద్‌కుమార్‌, ఎల్‌.ర మణ మీడియాతో మాట్లాడారు.

కరీంనగర్‌ :  స్టాంపు పేపర్లపై అదనపు బాదుడు

కరీంనగర్‌ : స్టాంపు పేపర్లపై అదనపు బాదుడు

జిల్లాలో స్టాంపు పేపర్ల విక్రయదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విలువ కంటే అదనంగా వసూలు చేస్తూ వెండర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో కొనుగోలుదారులు అడిగిన మొత్తాన్ని ఇవ్వక తప్పడం లేదు.

సాగుకు కూలీల కొరత

సాగుకు కూలీల కొరత

వరి నాట్లు వేయడంలో ఎదురవుతున్న కూలీల సమస్యలు అదిగమించేందుకు అన్నదాతలు పొరుగు రాష్ట్రాల కూలీలపై ఆధారపడుతున్నారు. సీజన్‌లో నాట్లు వేయడానికి కూలీలు లభించకపోవడం, దొరికిన కూలీల ధరలు ఎక్కువగా ఉండడం, అర్ధాంతరంగా పనులు వదిలి ఎక్కువ కూలీలు డిమాండ్‌ చేస్తుండడం తదితర సమస్యలను ఎదుర్కొంటున్న రైతులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కూలీలకు పనులను అప్పగిస్తున్నారు.

సమస్యలపై పోరుబాట..

సమస్యలపై పోరుబాట..

గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక వలస వెళ్తున్న కూలీలకు స్థానికంగా ఉపాధిని కల్పించే లక్ష్యంగా ఏర్పడ్డ మహాత్మా గాంధీ ఉపాధిహామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తెచ్చింది. ఎస్‌ఆర్‌ఈజీఎస్‌ స్థానంలో వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌ గార్‌ అజీవిక మిషన్‌ - గ్రామీణ(వీబీ జీరామ్‌జీ)గా మార్చింది.

కొత్త పింఛన్లపై ఆశలు..

కొత్త పింఛన్లపై ఆశలు..

కొత్త పింఛన్లు ఈనెల 15వ తేదీ నుంచి మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నాలుగేళ్లుగా కొత్త పింఛన్ల మంజూరు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. చివరి సారిగా 2022 అక్టోబర్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాం లో కొత్త పింఛన్లు మంజూరు చేశారు.

వీర్లపల్లి ప్రజలకు త్వరలో నివేశన స్థలాలు

వీర్లపల్లి ప్రజలకు త్వరలో నివేశన స్థలాలు

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్రభావిత గ్రామమైన వీర్లపల్లి వాసులకు త్వరలోనే నివేశన స్థలాలు అందించి ఇండ్లు నిర్మించేందుకు ప్రభు త్వం నిర్ణయం తీసుకుంటున్నట్టు రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు.

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు

ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టప్రకారం శిక్షలు కఠినంగా అమలులో ఉన్నాయని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి అపర్ణ మల్లాది అన్నారు. జెఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో మండల న్యాయ సేవ సమితి ఆధ్వర్యంలో శనివారం ర్యాగింగ్‌ పై న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు.

పాఠశాలల్లో అప్రమత్తంగా ఉండాలి

పాఠశాలల్లో అప్రమత్తంగా ఉండాలి

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీ, అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలోని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అప్ర మత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, స్పెషల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి