Share News

కాళేశ్వరంపై ప్రభుత్వానివి అవగాహన లేని మాటలు

ABN , Publish Date - Aug 02 , 2026 | 11:48 PM

కాళే శ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి, మంత్రులకు కనీస అవగాహ న లేదని, బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రుల బృందం విమర్శించింది. ఆదివారం నందిమేడారం నంది పంప్‌హౌస్‌ను బీఆర్‌ఎస్‌ నాయకులు సందర్శిం చారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు కొప్పుల ఈశ్వర్‌, బోయినిపల్లి వినోద్‌కుమార్‌, ఎల్‌.ర మణ మీడియాతో మాట్లాడారు.

కాళేశ్వరంపై ప్రభుత్వానివి అవగాహన లేని మాటలు

ధర్మారం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): కాళే శ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి, మంత్రులకు కనీస అవగాహ న లేదని, బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రుల బృందం విమర్శించింది. ఆదివారం నందిమేడారం నంది పంప్‌హౌస్‌ను బీఆర్‌ఎస్‌ నాయకులు సందర్శిం చారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు కొప్పుల ఈశ్వర్‌, బోయినిపల్లి వినోద్‌కుమార్‌, ఎల్‌.ర మణ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభు త్వంలో మంత్రిగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరుకు గ్రావిటీ ద్వారా నీళ్లు వెళ్తున్నాయని చెప్పడం హాస్యాస్ప దమని కొప్పుల ఎద్దేవా చేశారు. గ్రావిటీ ద్వారా నీళ్ళు పారుతే ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్‌ ఎందుకు ప్రతిపాదన చేశారో చేప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ రాక ముందు 35 లక్షల ఎకరాల సాగు నీరుతో 68 లక్షల ఎకరాల్లో పంటలు పండేవని, కేసీఆర్‌ వచ్చి, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణం జరిగిన తరువాత, కోటి అరవై లక్షాల ఎకరాల సాగు నీరుతో 2 కోట్ల 68 లక్షల ఎకరాల్లో పంటలు పండాయని గుర్తుచేశారు. అడ్లూరి తెలిసి తెలియని మాటలతో ప్రజలు నవ్వుకుంటున్నారని కొప్పుల విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకులకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అవగాహన కలిగించేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు కొప్పుల చెప్పారు. మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌, నీళ్ళ గురించి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి ఏమీ తెలియదని విమర్శించారు. కాళేశ్వరం అంటే గుడి అనుకుంటున్నారని, కాళేశ్వరం ఒక సమగ్ర ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్ట్‌ అని తెలిపారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ గురించి ముఖ్య మంత్రికి, మంత్రులకు అవగాహన లేకపోవడం శోచనీయమన్నారు. ఎల్లంపల్లి నుంచి నంది పంపుహజ్‌కు 100 మీటర్ల ఎత్తున, ఎల్లంపల్లి నుంచి గాయత్రి పంప్‌ హౌజ్‌కు 300 మీటర్ల ఎత్తులో మోటార్లు నీటిని ఎత్తి పోస్తున్నాయని వినోద్‌ కుమార్‌ చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్‌లో తెలంగాణ ప్రాంతం సాగు, తాగు నీరు కోసం చెరువులు, కుంటలు, వాగులపై ఆధార పడిన ప్రాంతమని మాజీ ఎమ్మెల్సీ ఎల్‌.రమణ తెలిపారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ మినహా తెలంగాణ ప్రాంతమంతా కరువుతో ఉండేదని పేర్కొ న్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముందు చూపుతో కేసీఆర్‌ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్‌ అయిన కాళేశ్వరం రూపకల్పన చేశా రని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు ఈ ఎత్తిపోతలతో పటాపంచాలయ్యాయని పేర్కొ న్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా కేసీఆర్‌కు వచ్చిన కీర్తిప్రతిష్టలను దెబ్బతీయాలని, చిన్న పాటి సాంకేతిక లోపాన్ని సాకుగా చూపించి ప్రాజెక్ట్‌ను నిర్వీర్యం చేయాలని కాంగ్రెస్‌ భావి స్తుందని రమణ మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ నాయకులు కళ్ళు తెరిచి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు. పంప్‌ హౌజ్‌ పరిశీలనకు వచ్చిన బీఆర్‌ఎస్‌ నాయకులకు స్థానిక నాయకులు స్వాగతం పలికారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, పెద్దపల్లి, చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్‌, దాసరి మనోహర్‌రెడ్డి, కరీంనగర్‌, జగిత్యాల మాజీ జడ్పీ చైర్మన్లు తుల ఉమ, దావ వసంత, నందిమేడారం ప్యాక్స్‌ చైర్మన్‌ ముత్యాల బలరాంరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2026 | 11:48 PM