Share News

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు

ABN , Publish Date - Aug 02 , 2026 | 12:02 AM

ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టప్రకారం శిక్షలు కఠినంగా అమలులో ఉన్నాయని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి అపర్ణ మల్లాది అన్నారు. జెఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో మండల న్యాయ సేవ సమితి ఆధ్వర్యంలో శనివారం ర్యాగింగ్‌ పై న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు.

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు

రామగిరి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టప్రకారం శిక్షలు కఠినంగా అమలులో ఉన్నాయని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి అపర్ణ మల్లాది అన్నారు. జెఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో మండల న్యాయ సేవ సమితి ఆధ్వర్యంలో శనివారం ర్యాగింగ్‌ పై న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ ఎవరైనా తోటి విద్యా ర్థులపై కళాశాల ప్రాంగణంలో లేదా బయట ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టప్రకారం కఠిన శిక్షలు పడతాయని పేర్కొన్నారు. ర్యాగింగ్‌ అనైతిక, అమానవీయ చర్య అన్నారు. సత్ప్రవర్తనతో చట్టబద్దంగా మెదలుకోవా లని సూచించారు. బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ ర్యాగింగ్‌ పాశ్చాత్య సంస్క్రతిగా అభివర్ణించారు. ఇతరుల హక్కులకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తగా ఉండాలని, మాదక ద్రవ్యా లకు దూరంగా ఉండాలని సూచించారు. అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సుధారాణి, ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి అనురాధ, బార్‌ అసోసి యేషన్‌ జాయింట్‌ సెక్రటరీ కటకం శ్రీనివాస్‌, న్యాయవాదులు శశిభూష ణ్‌కాచె, ఆంజనేయులు, బుద్దేస్వామి, శ్రీనివాస్‌, హార్టికల్చర్‌ పాటిటెక్నిక్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సువర్ణప్రనీత్‌, జేఎన్టీయూ ఫిజికల్‌ డైరెక్టర్‌ పింగిలి కృష్ణారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2026 | 12:02 AM