Share News

పాఠశాలల్లో అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Aug 02 , 2026 | 12:01 AM

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీ, అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలోని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అప్ర మత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, స్పెషల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

పాఠశాలల్లో అప్రమత్తంగా ఉండాలి

పెద్దపల్లి కల్చరల్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీ, అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలోని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అప్ర మత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, స్పెషల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలలు, వసతి గృహాల్లో ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాములు, తేళ్లు వచ్చే ప్రమాదం ఉందని, దోమలు, ఈగలు రాకుండా ఎప్పటికప్పుడు శుభ్రత పాటిం చాలని తెలిపారు. వసతి గదులు, వంటగదులు, మరుగుదొడ్లు, పాఠశాల ఆవరణ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటిని ప్రతీ 15 రోజులకోసారి తప్పనిసరిగా పరీక్షించి విద్యార్థులకు మంచినీటిని అందించాలన్నారు. అలాగే విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, వారి విద్యా ప్రమాణాల మెరు గుకు నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. ఉపాధ్యాయులు తమ పనితీరును మరింత మెరుగు పర్చుకోవాలన్నారు. ఖాన్‌ అకాడమి, ఫిజిక్స్‌ వాలా, డిజిటల్‌ విద్యా వనరులను పూర్తిస్థాయిలో వినియోగించి విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పెంచుకోవచ్చన్నారు. విద్యార్థుల ఫేస్‌ రిక్నగ్నైజేషన్‌ వందశాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఈఓ శారద, జీసీడీఓ కవిత, మల్లేశం, ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ, యూఆర్‌ఎస్‌ స్పెషల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

15వ తేదీ నాటికి యూనిఫాంలు అందించాలి

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతీ విద్యార్థికి తొలి జత యూనిఫాంలను ఈ నెల 15 నాటికి తప్పనిసరిగా అందించాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో పాఠశాల యూనిఫాం, పంపిణీ స్వయం సహాయక సంఘాల కార్యకలాపా లపై సెర్ప్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని గురుకుల, రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల విద్యార్థులకు ఇప్పటికే యూనిఫాం పంపిణీ జరి గిందని, నిర్ణీత గడువులోగా అందించిన స్వయం సహాయక సంఘాల మహిళలను ఆయన అభి నందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందేలా చూడాలని కోరారు. అదనపు డీఆర్‌డీఏ రవీందర్‌, స్ర్తీనిధి ప్రాంతీయ మేనేజర్‌ దుర్గా ప్రసాద్‌, ఏపీఎంలు, సెర్ఫ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2026 | 12:01 AM