వీర్లపల్లి ప్రజలకు త్వరలో నివేశన స్థలాలు
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:04 AM
ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్రభావిత గ్రామమైన వీర్లపల్లి వాసులకు త్వరలోనే నివేశన స్థలాలు అందించి ఇండ్లు నిర్మించేందుకు ప్రభు త్వం నిర్ణయం తీసుకుంటున్నట్టు రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు.
కోల్‌సిటీ, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్రభావిత గ్రామమైన వీర్లపల్లి వాసులకు త్వరలోనే నివేశన స్థలాలు అందించి ఇండ్లు నిర్మించేందుకు ప్రభు త్వం నిర్ణయం తీసుకుంటున్నట్టు రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. శనివారం కార్పొరేటర్ కం దుల స్వరూపసతీష్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు కొక్కి రాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్ ప్రభావంతో వీర్లప ల్లి గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యం పునరా వాసం కల్పించే విషయంలో సరైన చర్యలు తీసుకోలే దన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో చర్చించినట్టు తెలి పారు. కలెక్టర్‌తో సమావేశమై వీర్లపల్లి ప్రజలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టామన్నారు. ప్లాట్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించామని, త్వరలోనే నిర్మాణ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుం దన్నారు. మేయర్ మహంకాళి స్వామి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ తదితరులు ఉన్నారు.
సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్ పరిధిలోని స్పెక్ర్టా స్కూల్ సమీపంలో రూ.60లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను శనివారం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడు తూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిం చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్పొరేటర్ కంకణాల మౌనికరాజు, దూళికట్ట సతీష్, వేగోళపు రమాదేవి, నాయకులు గంగ శ్రీనివాస్, ధనుంజయ్, గడ్డం శ్రీనివాస్, కాంట్రాక్టర్ కృపాకర్‌రావు ఉన్నారు.