చదువుతోనే ఉన్నత శిఖరాలు అందుకోవచ్చు
ABN , Publish Date - Aug 02 , 2026 | 11:51 PM
చదువుతో ఉన్నత శిఖరా లలో ఉంటారని తహసీల్దార్ రాపెల్లి రాముడు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం అందించిన మెటీరియల్ కార్పెట్, బెడ్‌షీట్లు, నోటుబుక్కులు, ప్లేట్లు, గ్లాసులు అందించారు.
కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): చదువుతో ఉన్నత శిఖరా లలో ఉంటారని తహసీల్దార్ రాపెల్లి రాముడు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం అందించిన మెటీరియల్ కార్పెట్, బెడ్‌షీట్లు, నోటుబుక్కులు, ప్లేట్లు, గ్లాసులు అందించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యాబోధన అందిస్తూ హాస్టల్ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నదన్నారు. మెనూ ప్రకారం భోజనం, బ్రేక్ ఫాస్ట్ అల్పాహారం తదితర మంచి భోజనం అందిస్తుందన్నారు. తల్లితండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా శ్రద్ధగా చదువుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని ఆయన అన్నారు. వసతి గృహ సంక్షేమ అధికారి సత్యనారాయణ, సిబ్బంది రమేష్, శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.