Home » Sircilla
పాఠశాలల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు అన్నారు. మండలంలోని గంగారం, ఊషన్నపల్లి గ్రామాల్లో బుధవారం రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ.32 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఉన్నత పాఠశాల భవనాన్ని, కంప్యూటర్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు.
ఉద్యానవన పంటలు సాగు చేస్తేనే రైతులకు అధిక లాభాలు వస్తాయని ఉద్యానవన శాఖ విస్తరణ అధికారి రాము అన్నారు. మంగళ వారం రాఘవాపూర్, పెద్దబొంకూర్ గ్రామా ల్లోని పామాయిల్, బీర, కీరదోస, కూరగాయ తోటలను పరిశీలించారు.
జైలుభరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జీ జ్యోతి పిలుపు నిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న జైలుభరో కార్యక్రమంపై ముద్రిం చిన కరపత్రాలను మంగళవారం కాలేజీ గ్రౌండ్‌లో ఆవిష్కరించారు,
తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, మొదటి ఆరునెలలు తల్లిపాలు మాత్రమే పట్టడం వల్ల శిశువుకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజె క్టు అధికారి అనిత అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్స వాలు నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్‌బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకా న్ని ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరో పిస్తూ సోమవారం ఏబీవీపీ నాయకులు పట్ట ణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో చేశారు.
ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్‌హౌస్ కొంత కాలంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల విమర్శ, ప్రతి విమర్శలకు వేదికైంది. గోదావరిలో నీళ్లు వృథాగా పోతున్నా కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఉద్దేశ్యంతోనే కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తిపోయడం లేదని మాజీ మంతి కొప్పుల ఈశ్వర్ గత నెల 20న, మేడారంలోని నంది రిజర్వాయర్‌లో తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి క్రికెట్ ఆడి నిరసన తెలిపారు.
ప్రజావాణికి వచ్చే అర్జీలను అత్యంత ప్రాధాన్యంతో పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరిం చాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యల కోసం ఆదేశాలు జారీ చేశారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం మంత్రి శ్రీధర్‌బాబు, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంథని పట్టణంలో విస్తృతంగా పర్యటించి బొక్కలవాగు సందరీకరణ పనులను ప్రారంభించారు.
పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీపీసీ జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.