Share News

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎత్తివేసే కుట్ర

ABN , Publish Date - Aug 03 , 2026 | 11:58 PM

రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకా న్ని ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరో పిస్తూ సోమవారం ఏబీవీపీ నాయకులు పట్ట ణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద రాస్తారోకో చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎత్తివేసే కుట్ర

పెద్దపల్లి కల్చరల్‌, ఆగస్టు3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకా న్ని ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరో పిస్తూ సోమవారం ఏబీవీపీ నాయకులు పట్ట ణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద రాస్తారోకో చేశారు. ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్‌ మెంబర్‌ మారం సందీప్‌, జిల్లా కన్వీనర్‌ బండి రాజ శేఖర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం అందించే ఫీజు రీయిం బర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి చదు వుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.12 వేల కోట్లను విడుదల చేయకుండా విద్యార్థుల భవి ష్యత్‌తో ఆడుకుంటుందన్నారు. ప్రభుత్వ నిర్ల క్ష్యం కారణంగా యేటా 2 లక్షల మంది విద్యా ర్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన చెందారు. గత ప్రభుత్వం మాదిరి, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, విద్యా ర్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నిధులు విడుదల చేయాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్య మాలకు శ్రీకారం చుడుతామని హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఎస్‌ రాష్ట్ర కన్వీనర్‌ ఓమేష్‌, జిల్లా కన్వీ నర్‌ బండి రాజశేఖర్‌, నగర కార్యదర్శి అరవిం ద్‌, నగర ఉపాధ్యక్షుడు విగ్నేష్‌, నాయకులు సిద్దార్థ, శివ, దినేష్‌, కార్తీక్‌, శైలజ, మౌనిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2026 | 11:58 PM