Share News

ఫీజు రీయింబర్స్‌మెంట్‌బకాయిలు విడుదల చేయాలి

ABN , Publish Date - Aug 04 , 2026 | 11:31 PM

రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌ మెంట్‌బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి డిమాండ్‌ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌బకాయిలు విడుదల చేయాలి

కోల్‌సిటీ టౌన్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌ మెంట్‌బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి డిమాండ్‌ చేశారు. భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నియోజకవర్గ బీజేవైఎం ఆధ్వ ర్యంలో గోదావరిఖనిలోని పలు కళాశాలల్లో మంగళ వారం ’ఫీజుల బకాయి - బీజేపీ లడాయి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కందుల సంధ్యారాణి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగిం చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలల యాజమాన్యాలు కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయని పేర్కొ న్నారు. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు కలగ కుండా ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేసి వారికి పూర్తి భరోసా కల్పించాలని కోరారు. విద్యార్థుల సమ స్యల పరిష్కారానికి బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని, ప్రభుత్వం స్పందించే వరకు ప్రజా స్వామ్య బద్ధమైన ఆందో ళనలు కొన సాగిస్తామని స్పష్టం చేశారు. బీజేవైఎం నియో జకవర్గ ఇన్‌చార్జి మిడివెల్లి ఆంజనేయ ప్రసా ద్‌, కో-ఇన్‌ చార్జి సిలారపు కళ్యాణ్‌, మండల అధ్యక్షు డు గుండబోయిన భూమయ్య, బోడ కుంట సుభాష్‌, ఊరగొండ అపర్ణ, జక్కన బాలు, బూడిద హర్ష, జక్కుల పద్మ ప్రవీణ్‌, తాళ్లపల్లి నరేష్‌, నడిగట్టు రాజేందర్‌, హనుమాన్ల వెంకటేష్‌, అనిల్‌, ఆకునూరు రమేష్‌, శ్రీకాంత్‌, బాధవాత్‌ అనిల్‌ నాయక్‌, పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2026 | 11:31 PM