Share News

10న జైలుభరోను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Aug 04 , 2026 | 11:35 PM

జైలుభరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జీ జ్యోతి పిలుపు నిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న జైలుభరో కార్యక్రమంపై ముద్రిం చిన కరపత్రాలను మంగళవారం కాలేజీ గ్రౌండ్‌లో ఆవిష్కరించారు,

10న  జైలుభరోను విజయవంతం చేయాలి

పెద్దపల్లి టౌన్‌, ఆగస్టు 4 (ఆంఽధ్రజ్యోతి): జైలుభరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జీ జ్యోతి పిలుపు నిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న జైలుభరో కార్యక్రమంపై ముద్రిం చిన కరపత్రాలను మంగళవారం కాలేజీ గ్రౌండ్‌లో ఆవిష్కరించారు, ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేయాలన్నారు. గ్రామీణ ఉపాధిహామీ పేరు మార్చి, యంత్రాలతో పని చేయించుకోవచ్చనే నిబంధనలతో ప్రజల కు పని దొరకదన్నారు. రైతులకు, గృహజ్యోతి వినియోగదారులకు అం దిస్తున్న ఉచిత కరెంటును రద్దు చేసే విద్యుత్తు సవరణ చట్టం తెచ్చారని పేర్కొన్నారు. రైతులకు నష్టం చేస్తూ కార్పోరేట్‌ వ్యవసాయాన్ని ప్రోత్స హించే విధంగా కొత్త నిబంధనలతో విదేశాల నుంచి ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నారని, దీంతో ఇక్కడ పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశా లపై గ్రామాలు, పట్టణ వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. జైలుభరో కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, పేద ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు ఎస్‌ వెంకట స్వామి బొంకూరు సాగర్‌, రాజయ్య, అన్వేష్‌ దేవమ్మ, కనక లక్ష్మి, కొండయ్య కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2026 | 11:35 PM