ఎన్టీపీసీలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
ABN , Publish Date - Aug 02 , 2026 | 11:53 PM
పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీపీసీ జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
జ్యోతినగర్, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీపీసీ జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలను జిల్లా అథ్లెటిక్స్ అసోసి యేషన్ కార్యదర్శి కొమ్ము గట్టయ్య ప్రారంభించారు. ఇందులో వంద, 200 మీటర్లు పరుగు, లాంగ్ జంప్, షాట్‌పుట్‌తో పాటు పలు క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పలు విభాగాల్లో విజేతలుగా నిలి చిన క్రీడాకారులకు పతకాలు అందించి, అభినందించారు. అలాగే ప్రతిభ కనబరిచిన 60 మంది క్రీడాకారులు ఈ నెల 7న హనుమకొండలోని జేఎస్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని కార్యదర్శి గట్టయ్య తెలిపారు. పోటీల విజయవంతానికి సమకరించిన అసోసియే షన్ సభ్యులు, పలు మండలాల క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యా యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.