తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం
ABN , Publish Date - Aug 04 , 2026 | 11:33 PM
తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, మొదటి ఆరునెలలు తల్లిపాలు మాత్రమే పట్టడం వల్ల శిశువుకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజె క్టు అధికారి అనిత అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్స వాలు నిర్వహించారు.
కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు4(ఆంధ్రజ్యోతి): తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, మొదటి ఆరునెలలు తల్లిపాలు మాత్రమే పట్టడం వల్ల శిశువుకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజె క్టు అధికారి అనిత అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్స వాలు నిర్వహించారు. సీడీపీవో మాట్లాడుతూ ప్రసవమైన మొదటి గంట లోనే బిడ్డకు పాలు పట్టాలని, ముర్రుపాలు బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చే టీకాగా పని చేస్తాయన్నారు. మొదటి ఆరు నెలల వరకు బిడ్డకు నీళ్లు, తేనె, డబ్బా పాలు ఇవ్వకూడదని, ఆ తర్వాత పౌష్టికాహారంతోపాటు రెండేళ్ల వరకు తల్లిపాలు కొనసాగించాలని తెలిపారు. తల్లిపాల వల్ల శిశువులకు బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు, స్థూలకాయం నుండి కాపాడు కోవచ్చన్నారు. తల్లుల్లో రొమ్ము, అండాశయ, గర్భాశయ క్యాన్సర్ల ప్రమా దం తగ్గుతుందన్నారు. తల్లులు సంపూర్ణ పోషకాహారం తీసుకోవాలని, పాలు ఇచ్చే సమయంలో టీ, కాఫీ, మద్యపానానికి దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎంపీడీవో సురేందర్, ఎంఈవో సిరిమల్ల మహేష్, ఏసీడీపీవో సంపద కుమారి, సూపర్‌వైజర్లు సావిత్రి కుమార్, కుమారి, పోషన్ అభియాన్ కోఆర్డినేటర్ కుమారస్వామి, డాక్టర్ శ్రీచందన, ఏఎన్‌ఎం సరోజన, మండల అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, తల్లులు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.