Share News

ప్రజావాణి అర్జీలపై వెంటనే పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 03 , 2026 | 11:54 PM

ప్రజావాణికి వచ్చే అర్జీలను అత్యంత ప్రాధాన్యంతో పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరిం చాలని అదనపు కలెక్టర్‌ శ్రీరాములు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యల కోసం ఆదేశాలు జారీ చేశారు.

ప్రజావాణి అర్జీలపై వెంటనే పరిష్కరించాలి

పెద్దపల్లి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణికి వచ్చే అర్జీలను అత్యంత ప్రాధాన్యంతో పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరిం చాలని అదనపు కలెక్టర్‌ శ్రీరాములు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యల కోసం ఆదేశాలు జారీ చేశారు. సుల్తానాబాద్‌ మండలం తొగర్రాయికి చెందిన ఈదునేరు పద్మ భర్త మరణానంతరం ఇద్దరు కుమారులు, కోడలు తనను పట్టించుకోవడం లేదని, తన భూమిని బలవంతంగా సాగు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆమె సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించారు. పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటకు చెందిన పద్మ తన భూమికి కార్పొరేషన్‌ బోరింగ్‌ మంజూరైందని, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా విద్యుత్‌ మోటారు మంజూరు చేయాలని కోరారు. సోలార్‌ పంప్‌సెట్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ఉద్యానశాఖ అధికారులను ఆదేశించారు. మంథని పట్టణానికి చెందిన ఆకుల సౌమ్య పదో వార్డులో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌ పోస్టును కేటాయించాలని కోరగా, జిల్లా సంక్షేమ అధికారికి రాశారు. పెద్దపల్లి మండలం రంగంపల్లికి చెందిన ఎం. జయశ్రీ బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేశానని, ప్రభుత్వ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టులో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని పరిశీలించి సాధ్యమైన మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. అధికారులు, కలెక్టరేట్‌ ఏవో బి ప్రకాశ్‌, పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2026 | 11:54 PM