Share News

ఉద్యాన పంటలతో రైతులకు అధిక లాభాలు

ABN , Publish Date - Aug 04 , 2026 | 11:36 PM

ఉద్యానవన పంటలు సాగు చేస్తేనే రైతులకు అధిక లాభాలు వస్తాయని ఉద్యానవన శాఖ విస్తరణ అధికారి రాము అన్నారు. మంగళ వారం రాఘవాపూర్‌, పెద్దబొంకూర్‌ గ్రామా ల్లోని పామాయిల్‌, బీర, కీరదోస, కూరగాయ తోటలను పరిశీలించారు.

ఉద్యాన పంటలతో రైతులకు అధిక లాభాలు

పెద్దపల్లి రూరల్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ఉద్యానవన పంటలు సాగు చేస్తేనే రైతులకు అధిక లాభాలు వస్తాయని ఉద్యానవన శాఖ విస్తరణ అధికారి రాము అన్నారు. మంగళ వారం రాఘవాపూర్‌, పెద్దబొంకూర్‌ గ్రామా ల్లోని పామాయిల్‌, బీర, కీరదోస, కూరగాయ తోటలను పరిశీలించారు. రైతులు పంట మార్పిడి చేపట్టాలని వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పండ్లు, పామాయిల్‌, పూల తోటలు సాగు చేపట్టాలన్నారు. ప్రయోజనాలు, రాయితీలు పొందేందుకు రైతు రిజిస్ట్రీ తప్పకుండా చేయా లన్నారు. పంట మార్పిడి విధానం ప్రత్యా మ్నాయ పంటల సాగుపై రైతులకు సూచ నలు చేశారు. పంట మార్పిడితో రైతులకు ఆదాయ మార్గాలు ఏర్పడతాయని, మార్కెట్‌ డిమాండ్‌ ఉన్న పంటల సాగు చేసి ఆర్థి కంగా అభివృద్ధి చెందాలన్నారు. ఫార్మ్‌పాండ్స్‌ వందశాతం సబ్సిడీ ఉందని రైతులు సద్వి నియోగం చేసుకోవాలన్నారు. సర్పంచ్‌ కల్వల తిరు పతి, రైతులు అడిచర్ల శంకరయ్య, రాజే శం, తిరుపతి, వంశీ, రాజు పాల్గొన్నారు.

ముత్తారం, (ఆంధ్రజ్యోతి): డ్రిప్‌ ఇరిగేషన్‌ రాయితీలను రైతులు సద్వినియోగం చేసు కోవాలని మండల వ్యవ సాయ అధికారి జె. అనూష కోరారు. మైదంబండ గ్రామా నికి చెందిన రైతు బియ్యని లింగం ఆయిల్‌ పామ్‌ తోటను సందర్శించారు. ఆయిల్‌పామ్‌ తోటల్లో అంతర పంటల ద్వారా ఆదాయం పొందవచ్చని తెలిపారు. కంది, పెసర, మినుము పప్పుధాన్యాలతో పాటు నువ్వులు, పొద్దుతిరుగుడు కూరగాయలను సాగు చేస్తే రాబడి వస్తుందన్నారు. ప్రభు త్వం ఇస్తున్న రాయితీలను వినియోగించు కోవాలన్నారు. పంటల సాంకేతిక సూచనలకు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించా లని కోరారు. వ్యవసాయ విస్తరణ అధికా రులు బి. శశిధర్‌, మనీషా పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2026 | 11:36 PM