Home » Sircilla
గ్రామపంచాయతీలో వీబీజీరామ్‌జీ పనుల్లో 4 కేటగిరిల్లో 375 పనులను గుర్తించాలని జడ్పీ సీఈవో నరేందర్ సూచించారు. జెఎన్‌టియు ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికపై జిల్లా స్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
తెలంగాణ ఆడబిడ్డలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందని, కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శనివా రం రంగంపల్లి ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
అల్పపీడన ప్రభావంతో జిల్లాను వర్షాలు ముంచెత్తుతాయని భావించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. గడిచిన మూడు రోజులుగా ఎంతగానో ఊరించిన వానలు అంతలోనే ఉసూరుమనిపించాయి. మోస్తారును మించి వర్షం కురవలేదు.
విశేష పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. గణపతి బప్పా మోరియా.. మంగళమూర్తి మోరియా.. గణేష్ మహారాజ్‌కి జై.. అంటూ భక్తుల నీరాజనాలు మార్మోగాయి. ఉదయం నుంచి తెల్లవారులు బొజ్జ గణపయ్య శోభాయాత్ర కన్నుల పండువగా నిర్వహించారు.
జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. ఎల్‌నినో ప్రభావంతో ఈయేడు వానాకాలం సీజన్‌లో వర్షాలు సరిగా కురవలేదు. అడపాదడపా కురిసిన వర్షాలతో రైతులు సాగు చేశారు. అనంతరం సరైన వర్షాలు కురవకపోవడంతో కళ్ళ ముందు బీటలు వారుతున్న పొలాలను చూసిన రైతులు మనోవేదనకు గురయ్యారు.
రైతుల సం క్షేమం, అభివృద్ధికి సహాయ సహకారాలు అందించమే సంఘం ప్రాధాన్యమని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. పీఏసీఎస్ కార్యాయలంలో శుక్రవారం సంఘం సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు.
పారఖ్ పరీక్షను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని జిల్లా అకాడ మిక్ మానిటరింగ్ కో-ఆర్డినేటర్ ఎండీ షేక్ అంజద్ ఉపాధ్యాయులకు సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీ కార్మికుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై హమాలీ సంఘాల ప్రతినిధులు, లారీ ఓనర్ల యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు.
జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తూ, స్థానిక యువతకు మెరుగైన ఉపాధి, నైపుణ్య శిక్షణ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎంప్లాయిమెంట్ టైన్రింగ్, ఇండస్ట్రీ, ఎంగేజ్‌మెంట్ అంశంపై వివిధ కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
మైనింగ్ భద్రతలో ఆధునిక సాంకే తికతను అందిపుచ్చుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ టీఆర్ కన్నన్ అన్నా రు. 55వ జోనల్ రెస్య్కూ పోటీల ముగింపు కార్యక్రమం గురువారం రాత్రి ఎన్‌సీఓఏ క్లబ్ రెస్క్యూస్టేషన్‌లో జరిగింది.