విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:44 PM
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చందుపట్ల సునీల్‌రెడ్డి అన్నారు. ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమంలో భాగంగా బుధవారం జెఎన్టీయూ కళాశాలకు చెందిన విద్యార్థులను కలిసారు. ఫీజు బకాయిలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
రామగిరి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చందుపట్ల సునీల్‌రెడ్డి అన్నారు. ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమంలో భాగంగా బుధవారం జెఎన్టీయూ కళాశాలకు చెందిన విద్యార్థులను కలిసారు. ఫీజు బకాయిలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బాధ్యత మరిచిన రాష్ట్ర ప్రభుత్వం 40 లక్షల మంది విద్యార్థులతో చెలగాటం ఆడుతూ విద్యార్థుల భవిష్యత్‌ను ఆగమ్యగోచరంగా మార్చిందని ఆరోపించారు. పేద కుటుంబాల పిల్లలకు బకాయిలు చెల్లించలేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో స్కాలర్‌షిప్స్ అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు ఉపాధి అవకాశాలకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల మంది విద్యార్థుల చదువులు, ఉద్యోగ అవకాశాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.