ప్రజలకు మెరుగైన వేద్య సేవలందించాలి
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:43 PM
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతీ రోగికి నాణ్యమైన వైద్య సేవలను సకాలంలో ఆందేలా వైద్యాధికారులు, సిబ్బంది పని చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం సుల్తానాబాద్ ప్రభుత్వ అసుపత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు.
సుల్తానాబాద్, ఆగస్టు 5 ఆంద్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతీ రోగికి నాణ్యమైన వైద్య సేవలను సకాలంలో ఆందేలా వైద్యాధికారులు, సిబ్బంది పని చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం సుల్తానాబాద్ ప్రభుత్వ అసుపత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఓపీ, ప్రసూతీ విభాగాలు, ల్యాబ్‌లు, ఫార్మసీని పరిశీలిస్తూ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు విశ్వాసం పెరిగేలా నాణ్యమైన వేద్య సేవలు అందించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది తమ విధి నిర్వహణలో సమయపాలన పాటిస్తూ ఆసుపత్రికి వచ్చే ప్రతీ రోగికి సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ అసుపత్రిల్లో ఓపీ, ఔట్ పేషంట్ల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. గర్భిణీలను ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు వైద్య సిబ్బంది సమన్వయంతో ఫాలో అప్ చేస్తూ అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. హైరిస్కు గర్భిణీలను గుర్తించి నిరంతర పర్యవేక్షణలో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో పరిశుభ్రతకు అత్యధిక ప్రాఽధాన్యత ఇవ్వాలని, వార్డులు మరుగుదొడ్లు, ఆసుపత్రి పరిసరాలను ఎల్లప్పడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అత్యవసర సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రోగుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, రిఫెరల్స్‌ను తగ్గిస్తూ సాధ్యమైనంత మేరకు స్థానికంగానే నాణ్యమైన చికిత్స అందించాలన్నారు. వైద్య అధికారులు ,ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.