Share News

ప్రత్యామ్నాయ పంటలతోనే రైతులకు భరోసా

ABN , Publish Date - Aug 08 , 2026 | 12:13 AM

రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గే అవ కాశం ఉన్నందున రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లేలా అవగాహన కల్పించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.

ప్రత్యామ్నాయ పంటలతోనే రైతులకు భరోసా

పెద్దపల్లి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గే అవ కాశం ఉన్నందున రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లేలా అవగాహన కల్పించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వ హించారు. ఆయన మాట్లాడుతూ కంది, పెసర, మినుములు, ఆయిల్‌పామ్‌, చిరుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచిం చారు. సాగునీటి విడుదలపై మరో 15 రోజుల తర్వాత ప్రాజెక్టుల నీటి మట్టా లను సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం 16 లక్షలకు పైగా కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేసిందని, ఈనెల 15 నుంచి 1.05 కోట్ల కుటుంబాలకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలి పారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతీ జిల్లాలో ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలను ముందుగానే రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 35 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, వరి విస్తీర్ణం పెరగకుం డా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని సాగు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మండల ప్రజావాణిని ప్రతీ వారం నిర్వహిం చి ప్రజా సమస్యలను స్థానికంగానే పరిష్కరించాలని, వనమహోత్సవం, చేయూత పెన్షన్లు, యూనిఫాం కుట్టు పనులు, వీబీజీరామ్‌జీ కార్యక్రమాలను నిర్ధ్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.

Updated Date - Aug 08 , 2026 | 12:13 AM