మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టాలి
ABN , Publish Date - Aug 06 , 2026 | 11:43 PM
తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి సమాజాభివృద్ధికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు పిలుపు నిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జయశంకర్ జయంతి తోపాటు బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.
పెద్దపల్లి కల్చరల్, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి సమాజాభివృద్ధికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు పిలుపు నిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జయశంకర్ జయంతి తోపాటు బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేసిన మహ నీయుడని కొనియాడారు. నేటి యువత మహనీయుల జీవిత చరి త్రలు తెలుసుకుని వారి అడుగు జాడల్లో నడవాలన్నారు. మాదకద్ర వ్యాలు, ఇతర వ్యసనాల నిర్మూలనకు ప్రతీ ఒక్కరు బాధ్యతతో ముం దుకు రావాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్ పాలన అధికారి ప్రకాష్, డీఈవో శారద, సీపీవో రవీందర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కోల్‌సిటీ, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను యావత్ ప్రపం చానికి చాటి చెప్పి ప్రత్యేక రాష్ట్ర సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన మహ నీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. కమిషనరేట్‌లో జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీ మాట్లాడుతూ సిద్ధాంతకర్తగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీ యుడని కొనియాడారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, ఏఓ శ్రీనివాస్, ఆర్‌ఐలు దామోదర్, రమేష్ పాల్గొన్నారు.