Share News

క్షేత్రస్థాయిలోనే సమస్యలకు పరిష్కారం

ABN , Publish Date - Aug 06 , 2026 | 11:44 PM

క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు. గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులను పరిశీలించి, వాటికి తగిన అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

క్షేత్రస్థాయిలోనే సమస్యలకు పరిష్కారం

ముత్తారం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు. గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులను పరిశీలించి, వాటికి తగిన అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిషన్‌ భగీరథ గ్రిడ్‌, ఇంట్రా పైప్‌లైన్‌ వ్యవస్థలోని లోపాలపై సమగ్ర నివేదిక రూపొందించి, నిధుల కోసం కార్యాచరణ ప్రణాళికను పంపాలన్నారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతు చేపట్టాలని తెలి పారు. రైతులను ఆయిల్‌పామ్‌ సాగు దిశగా ప్రోత్సహిస్తూ యూరియా కొరత లేకుండా పకడ్బందీగా సరఫరా చేయాలన్నారు. నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ, మందుల కొరత తలెత్తకుండా చూడాలని సూచించారు. జలసిరి కింద చేపడుతున్న ఇంకుడు గుంతలు, పంటకుంటల నిర్మాణా లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. సర్పంచ్‌ సుధాటి రవీందర్‌ రావు మాట్లాడుతూ.. 11 కేవీ విద్యుత్‌ లైను వల్ల పామాయిల్‌ తోటలకు, గృహాలకు విద్యుత్‌ సమస్యలు వస్తున్నాయని తెలిపారు. లక్కా రం సర్పంచ్‌ అత్తె చంద్రమౌళి మాట్లాడుతూ జాతీయ రహదారి నిర్మాణం వల్ల వర్షపు నీరు పొలాల్లోకి చేరుతోందని, రోడ్డుకు పైప్‌లైన్‌ వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మండల ప్రత్యేక అధికారి ఎం. రవీందర్‌, ఎంపీడీవో ఐ. ప్రవీణ్‌కుమార్‌, తహసీల్దార్‌ మధుసూదన్‌ రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ అల్లాడి యాదగిరిరావు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్య క్షుడు బియ్యాని శివకుమార్‌, సర్పంచ్‌లు అత్తె చంద్రమౌళి, రాపల్లి రాజయ్య, చిలువేరి జ్యోతి, కొట్టె అన్నపూర్ణ, మెంగాని సమత, గడ్డం రాజేశం, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2026 | 11:44 PM