సుల్తానాబాద్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:15 AM
రాష్ట్రంలో పేదలకు ఉన్నత విద్యావకాశాలు మెరుగుపర్చడంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో సుల్తానాబాద్‌లో నెలకొల్పుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.
సుల్తానాబాద్, ఆగస్టు 7 ఆంద్రజ్యోతి): రాష్ట్రంలో పేదలకు ఉన్నత విద్యావకాశాలు మెరుగుపర్చడంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో సుల్తానాబాద్‌లో నెలకొల్పుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలను శుక్రవారం ఆయన జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. విజయరమణారావు మాట్లాడుతు వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ స్కూల్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమవుతుందని, ఉన్నత స్థాయి ప్రమాణాలతో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసం ఉంటుందన్నారు. జూనియర్ కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంబిస్తున్నట్లు చెప్పారు. సుల్తానాబాద్ కాలేజీలో చదువుకున్న వారు ఎంతో గొప్ప పేరు సంపాదించారని, ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తు చేస్తూ తాను కూడా ఇదే కాలేజీలో చదువుకున్నానని పేర్కొన్నారు కళాశాలను మంచి ఫలితాలతో చక్కని క్రమశిక్షణ తో నిర్వహిస్తున్నారంటూ ప్రిన్సిపాల్ రాంచెంద్రాడ్డిని ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాక్రిష్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, వైస్ చైర్ పర్సన్ పుష్పలత, కమిషనర్ రమేష్, లెక్చరర్లు సునీల్ తదితరులతో పాటు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు