రామగుండం కార్పొరేషన్ సుందరీకరణే లక్ష్యం
ABN , Publish Date - Aug 06 , 2026 | 11:48 PM
రామగుండం నగరాన్ని సుందరీ కరణ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు మేయర్ మహంకాళి స్వామి అన్నారు. గురువారం 7వ డివిజన్ వార్డు సందర్శనలో భాగంగా కమిషనర్ అరుణశ్రీ, కార్పొరేటర్ వేగోళపు రమాదేవి శ్రీనివాస్‌తో కలిసి సందర్శించారు.
కోల్‌సిటీ, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరాన్ని సుందరీ కరణ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు మేయర్ మహంకాళి స్వామి అన్నారు. గురువారం 7వ డివిజన్ వార్డు సందర్శనలో భాగంగా కమిషనర్ అరుణశ్రీ, కార్పొరేటర్ వేగోళపు రమాదేవి శ్రీనివాస్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు విద్యుత్ తీగలతో ఇబ్బందులు పడుతున్నామంటూ మేయర్ దృష్టికి తీసుకురాగా ట్రాన్స్‌కో ఏఈకి ఫోన్ చేసి విద్యుత్ తీగల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మూడు నెలలుగా ముందస్తు ప్రణాళికలతో కార్పొరేషన్‌లో శానిటేషన్‌పై స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రధాన కాలువల్లో పూడికను తొలగించడంతో ఇటీవల భారీ వర్షాలు కురిసినా వరద ముప్పు లేదన్నారు. వర్షాకాలానికి ముందే సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ సంస్థలకు హెచ్చ రికలు జారీ చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో 2ఏ మోరీ, వీర్లపల్లి, రామగుండం ప్రాంతాలు జలమయమయ్యాయన్నారు. రామగుండం అభివృద్ధికి ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఈ వార్డు సందర్శనలో అసిస్టెంట్ కమిషనర్ సంపత్‌కుమార్, ఈఈ శాంతి స్వరూప్, టీపీఎస్ నవీన్, ఏఈలు అన్వేష్, మనోజ్, నరేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాగభూషణం పాల్గొన్నారు.