Home » Sircilla
ప్రజా వాణి అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా డిప్యూటి టైనీ కలెక్టర్ బనావత్ వనజ తో కలిసి దరఖాస్తులను స్వీకరించారు.
జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల వరకు అవసరాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, పాఠశాల అభివృద్ధి పనులకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ తీర్మానాల ప్రకారం పూర్తి చేయాలన్నారు.
హిందు సమాజాన్ని ఐక్యత చేయడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కృషి చేస్తుందని కరీంనగర్ విభాగ్ సద్బావన్ ప్రముఖ్ కొండేటి బాలరాజు, సహ కార్యవాక్ కొంపెల్లి రాజన్న అన్నారు. ఆదివారం గోదావరిఖనిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పథ సంచాలన కార్యక్రమం సందర్భంగా సమరోక్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రామగుండం నియోజక వర్గంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కృషి చేస్తున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుతూ గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్ నాయకుడు కామ విజయ్ ఆధ్వర్యంలో ఎంపీ వంశీకృష్ణ, మంత్రులు వివేక్, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం బాణాసంచ కాల్చారు.
కరాటే ఆత్మరక్షణ కోసం ఎంతో ఉపయోగపడుతుందని మం డల విద్యాధికారి జింక మల్లేషం అన్నారు. ఆదివారం గోదావరిఖని ఆర్‌సీఓఏ క్లబ్లో స్కూల్స్, గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పై దాడిని ఖండిస్తూ, కుల వివక్ష కారణంగా ఐపీఎస్ అధికారి పూరన్‌కుమార్ ఆత్మహత్యకు కారణ మైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్‌లో ఆదివారం నిరసన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం పనులు వేగవంతం చేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందు కోసం ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో లబ్ధిదారుని కుటుంబాన్ని భాగస్వాములుగా చేయడానికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉపాధిహామీ పథకం అనుసంధానం చేసింది.
పట్టణంలో పలు చోట్ల ట్రాఫిక్ సిగ్నళ్ళు శనివారం పోలీసులు ఏర్పాటు చేశారు. గతంలో అయ్యప్ప టెంపుల్, బస్టాండ్ వద్ద సిగ్నల్స్ మాత్రమే పని చేసేవి. జిల్లా కేంద్రం కావడంతో పట్టణంలో వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబం ధనలు పాటించాలని, ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాల కు చేర్చాలని ఎస్సై మధుకర్ అన్నారు. మండల కేంద్రంలోని ఆటో స్టాండ్ వద్ద డ్రైవర్లకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
పెద్దపల్లి జిల్లా స్థాయి చద రంగ పోటీలు ఎలిగేడు మండల కేంద్రంలో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 69వ ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి అండర్ 14, 17 బాలబాలికల చదరంగ పోటీలు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు.