Share News

సింగరేణి అమ్మేందుకు కుట్రలు

ABN , Publish Date - Dec 26 , 2025 | 12:08 AM

సింగరేణి సంస్థను అమ్మ డానికి కాంగ్రెస్‌, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నాయకులు కుట్రలు పన్ను తున్నారని కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు రియాజ్‌ అహ్మద్‌, ఐ కృష్ణ ఆరోపించారు.

సింగరేణి అమ్మేందుకు కుట్రలు

గోదావరిఖని, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థను అమ్మ డానికి కాంగ్రెస్‌, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నాయకులు కుట్రలు పన్ను తున్నారని కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు రియాజ్‌ అహ్మద్‌, ఐ కృష్ణ ఆరోపించారు. గురువారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేక రుల సమావేశంలో వారు మాట్లాడుతూ తాడిచెర్ల బొగ్గు బ్లాక్‌ను ప్రైవేట్‌ పరం చేయడానికి ప్రయత్నిస్తే సింగరేణి కార్మిక సంఘాలు ఆందోళన చేశాయన్నారు. సంస్థ సంక్షోభంలో ఉందని, కాపాడుకోవడానికి కార్మిక సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. మణుగూరు గని వేలం పాట నిలిపివేయాలని, ప్రైవేట్‌ సంస్థల చేతుల్లోకి వెళితే సింగరేణి మనుగడ ఉండదన్నారు.

సింగరేణికే వచ్చే విధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంతో ప్రకటన చేయించాలని, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేం దుకు తాము కలిసి వస్తామన్నారు. మణుగూరును కాపాడుకునేందుకు అక్కడ బజార్‌ బంద్‌ నిర్వహించి ప్రజలను, వ్యాపారులను భాగస్వామ్యం చేస్తామని, జెన్‌కో ద్వారా మణుగూరు గనిని దక్కించుకుని అదాని, అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, లాభాల్లో ఉన్న సింగరేణి దివాళా తీసే పరిస్థితికి తీసుకువచ్చారని ఆరోపించారు. హెచ్‌ఎంఎస్‌, ఐఎఫ్‌టీయూ, ఏఐఎఫ్‌టీయూ, టీఎన్‌టీయూసీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2025 | 12:08 AM