షాపుల కూల్చివేత బాధితులకు న్యాయం చేయాలి
ABN , Publish Date - Dec 26 , 2025 | 11:45 PM
రామగుండం మున్సిపల్ కార్పొ రేషన్ పరిధిలో కూల్చివేతలు ఆపాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయపక్షాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
కోల్‌సిటీ, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): రామగుండం మున్సిపల్ కార్పొ రేషన్ పరిధిలో కూల్చివేతలు ఆపాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయపక్షాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీజేపీ, బీఆర్ ఎస్, జనసేన, బీఎస్‌పీ, న్యూఇండియా పార్టీ, హెచ్‌ఎంఎస్, ఐఎఫ్‌టీయూ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. ధర్నానుద్దేశించి బీఆర్‌ఎస్ జిల్లా అధ్య క్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నాయకులు కౌశిక హరి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హన్ముంతుగౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్ హయాంలో ఇచ్చిన పట్టాలకు సంబంధించిన నిర్మాణాలకు నష్టపరిహారం ఇవ్వకుండా కూల్చి వేస్తున్నారని, అభివృద్ధికి వెయ్యి కోట్లు తెచ్చామని చెబుతున్న నాయకులు నష్టపరిహారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సిరిశెట్టి మల్లేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహా నికి వినతిపత్రం సమర్పించారు. పర్లపల్లి రవి, కొండపర్తి సంజీవ్‌కుమార్, నారాయదాసు మారుతి, మూల విజయారెడ్డి, ఐలయ్యయాదవ్, కోమళ్ల మహేష్, జక్కుల నరహరి, పిడుగు కృష్ణ, అశ్రిత్‌గౌడ్ పాల్గొన్నారు.