నిరుపేదలకు ఇండ్లు కట్టించే బాధ్యత నాదే...
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:06 AM
రామగుండం కార్పొరేషన్‌లో నిరుపేదలకు ఇండ్లు కట్టించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. గురువారం తెల్లవారుజామున బైక్‌పై పలు డివిజన్లలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుని అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు.
కోల్‌సిటీ, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): రామగుండం కార్పొరేషన్‌లో నిరుపేదలకు ఇండ్లు కట్టించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. గురువారం తెల్లవారుజామున బైక్‌పై పలు డివిజన్లలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుని అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. రెండు సంవత్స రాలలో నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి డివి జన్లలో డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ దీపాలు, మంచినీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చేశామన్నారు.
ఎన్నికల ముందు రామగుండం ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని, పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నానని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయమని, ఎలాంటి సమస్యలున్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, తాత్కాలికంగా జరిగే కొన్ని ఇబ్బందులకు భవిష్యత్‌లో శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. నాయకులు రాజేష్, మహంకాళి స్వామి, శ్రీనివాస్, యుగంధర్, తానిపర్తి గోపాల్‌రావు ఉన్నారు.