హామీలు అమలులో గుర్తింపు సంఘాలు విఫలం
ABN , Publish Date - Dec 26 , 2025 | 11:51 PM
సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో గుర్తింపు, ప్రాతినిధ్య సం ఘాలు పూర్తిగా విఫలమైనట్టు టీబీజీకేఎస్ అధ్య క్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం వీకేపీ గనిలో జరిగిన గేట్‌మీటింగ్‌లో మాట్లా డారు. గుర్తింపు ఎన్నికల సందర్భంగా ఏఐటీ యూసీ 47, ఐఎన్‌టీయూసీ 39 హామీలను మెనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తామని వాగ్దానాలు చేసినట్టు తెలిపారు.
యైుటింక్లయిన్‌కాలనీ, డిసెంబరు 26 (ఆంధ్ర జ్యోతి): సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో గుర్తింపు, ప్రాతినిధ్య సం ఘాలు పూర్తిగా విఫలమైనట్టు టీబీజీకేఎస్ అధ్య క్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం వీకేపీ గనిలో జరిగిన గేట్‌మీటింగ్‌లో మాట్లా డారు. గుర్తింపు ఎన్నికల సందర్భంగా ఏఐటీ యూసీ 47, ఐఎన్‌టీయూసీ 39 హామీలను మెనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తామని వాగ్దానాలు చేసినట్టు తెలిపారు. గెలిచిన తర్వాత ఒక్క హామీ అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నట్టు విమర్శించారు. ప్రతి నెల రెండు మెడికల్ బోర్డులు నిర్వహించి వంద శాతం ఇన్వాలిడేషన్ అయ్యేలా చూస్తామని చెప్పారని, కానీ తొమ్మిది నెలల్లో ఒక్క మెడికల్ బోర్డు కూడా నిర్వహించలేదన్నారు. కార్మికులకు ఇబ్బందికరంగా ఉండేలా యాజమాన్యం ఆరు సర్క్యులర్లను జారీ చేసినా వాటిని వ్యతిరేకిం చకుండా రెండు సంఘాలు చోద్యం చూస్తున్నా యన్నారు. కోల్ ఇండియాలో లేని 18 హక్కులు సింగరేణిలో అమలు చేసిన ఘనత టీబీజీకేఎస్‌దని అన్నారు. కారుణ్య నియామకాల ద్వారా 14,000 మంది ఉద్యోగాలు సాధించారని, పెండింగ్‌లో ఉన్న 3,400 మందికి ఒకే దఫాలో ఉద్యోగం ఇప్పించినట్టు పేర్కొన్నారు. టీబీజీకేఎస్ గుర్తింపు సం ఘంగా కార్మికుల తల్లిదం డ్రులకు కార్పొరేట్ వైద్యం, విద్యుత్ చార్జీల ఎత్తివేత, 10 లక్షల వడ్డీలేని గృహ రుణాలు, రెండు అదనపు పీహెచ్‌డీలు ఇప్పించినట్టు తెలిపారు. టీబీజీకేఎస్ మాత్రమే కార్మికుల హక్కు ల పరిరక్షణ, సింగరేణి అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలిపారు. కాగా వివిధ యూనియన్లకు చెందిన 50 మంది కార్మికులు టీబీజీకేఎస్‌లో చేరా రు. అయిలి శ్రీనివాస్, ప్రభాకర్‌రెడ్డి, చంద్రయ్య, వెంకటేశం, రవితేజ, తిరుపతి, హరిప్రసాద్, శ్రీనివాస్, వెంకటస్వామి, రాజారాం పాల్గొన్నారు..