Share News

దంత వైద్య సేవలను వినియోగించుకోవాలి

ABN , Publish Date - Dec 26 , 2025 | 12:10 AM

ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న దంత వైద్య సేవలను అవసరమైన ప్రజలు విని యోగించుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష కోరారు. దంత సమస్యలతో కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్న కలెక్టర్‌ గురువారం జిల్లా ఆసుపత్రిలో రూట్‌కెనాల్‌ చేయించుకున్నారు.

దంత వైద్య సేవలను వినియోగించుకోవాలి

పెద్దపల్లిటౌన్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న దంత వైద్య సేవలను అవసరమైన ప్రజలు విని యోగించుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష కోరారు. దంత సమస్యలతో కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్న కలెక్టర్‌ గురువారం జిల్లా ఆసుపత్రిలో రూట్‌కెనాల్‌ చేయించుకున్నారు. ఆయన మాట్లాడుతూ కొంతకాలంగా పంటి నొప్పితో బాధపడుతున్నానని, దంత వైద్య నిపుణుల సూచన మేరకు గురువారం రూట్‌కెనాల్‌ ట్రీట్మెంట్‌ తీసు కున్నానని కలెక్టర్‌ తెలిపారు. సూపర్‌ స్పెషా లిటీ దంత వైద్య సేవలు నిర్వహించే స్థాయికి ప్రభుత్వ ఆసుపత్రులు ఎదిగాయన్నారు. వివిధ విభాగాల్లో క్లిష్టమైన ఆపరేషన్లు జిల్లా ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహిస్తున్నారని, ఆస్పత్రి అందించే విస్తృతమైన వైద్య సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్‌ కోరారు. రూట్‌కెనాల్‌ శస్త్ర చికిత్సలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీధర్‌, డాక్టర్‌ సత్య అన్వేష్‌ డాక్టర్‌ విజయ్‌ కుమార్‌ డాక్టర్‌ సుష్మితరావు పాల్గొన్నారు.

అండాశయంలోని గడ్డల తొలగింపు

జిల్లా ప్రభుత్వాస్పత్రిలో గురువారం ఓ మహిళ అండాశయంలోని గడ్డలను శస్త్ర చికిత్స చేసి తొలగించారు. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన 40 ఏళ్ళ మహిళ కొంత కాలంగా అండాశయంలో గడ్డలతో బాధపడుతోంది. సదరు మహిళ చికిత్స కోసం పెద్దపల్లి ఏసీపీ గజ్జికృష్ణను కలిసింది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీధర్‌తో మాట్లాడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించాలని కోరారు. మహిళను ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసుకున్నారు. ఆమెకు గతంలో 4 పెద్ద ఆపరేషన్లు జరిగాయి. దీంతో ఆపరేషన్‌ క్లిష్టంగా మారింది. అన్ని జాగ్రత్తలు తీసుకొని డాక్టర్‌ అనసూయ గైనకాలజిస్ట్‌, డా శ్రీధర్‌ ఆపరేషన్‌ ను విజయవంతంగా చేసి గడ్డలను తొలిగించారు. వైద్యుల బృందాన్ని సూపరింటెండెంట్‌ అభినందించారు.

Updated Date - Dec 26 , 2025 | 12:10 AM