గ్రామాల అభివృద్ధికి పాలకవర్గాలు కృషి చేయాలి
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:28 AM
గ్రామాలాభివృద్ధికి పంచాయతీల పాలకవర్గ సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డుసభ్యులను శ్రీశివకిరణ్ గార్డె న్స్‌లో మంగళవారం సన్మానించారు.
మంథని, డిసెంబరు 23: గ్రామాలాభివృద్ధికి పంచాయతీల పాలకవర్గ సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డుసభ్యులను శ్రీశివకిరణ్ గార్డె న్స్‌లో మంగళవారం సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ పాలకవర్గం సభ్యులు ప్రజల సంక్షేమం కోసం పని చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా శ్రమిం చాలని పిలుపునిచ్చారు. ఆనంతరం క్యాంపు కార్యాలయంలో మాజీ ప్రధా నమంత్రి పీవీ నరిసంహారావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణ దిశగా దేశాన్ని నడిపించిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహారావు అని కొనియాడారు. అయ్య ప్ప స్వామి దేవాలయంలో కొమురవెల్లి విజయ్‌కుమార్ దంపతులు నిర్వ హించిన మెట్లపూజలో పాల్గొన్నారు. సూరయ్యపల్లిలోని మేరీ మీడియా పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవంలో పాల్గొన్నారు. సీయోను ప్రార్థన మందిరంలో ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్క రించారు. నాయకులు ఐయిలి ప్రసాద్, వొడ్నాల శ్రీనివాస్, కొత్త శ్రీనివాస్, శశిభూషన్‌కాచే, మంథని సత్యం, అంకరి కుమార్, దూడ మహేష్, మంథని మార్క్, ఆజ్మీరా దయరాజు, శామ్యుల్, పాల్గొన్నారు.