Share News

సుల్తానాబాద్‌లో ఆరు కోట్లతో సుందరీకరణ

ABN , Publish Date - Dec 24 , 2025 | 12:26 AM

సుల్తా నాబాద్‌ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో భాగంగా రహదారుల నిర్మాణం చేపడుతున్నామని, ఇందుకు ఆరు కోట్ట రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు.

సుల్తానాబాద్‌లో ఆరు కోట్లతో సుందరీకరణ

సుల్తానాబాద్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సుల్తా నాబాద్‌ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో భాగంగా రహదారుల నిర్మాణం చేపడుతున్నామని, ఇందుకు ఆరు కోట్ట రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఐబీ చౌరస్తా నుంచి తహసీల్దార్‌ కార్యాలయం మీదుగా గట్టేపల్లి రోడ్డు చౌరస్తా వరకు డబుల్‌ రోడ్డు నిర్మాణంతోపాటు సెంట్రల్‌ లైటింగ్‌, రెండు చోట్ల ఐలాండ్స్‌ నిర్మాణ పను లను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతు గత ప్రభుత్వ హయాంలో సుల్తానాబాద్‌ అభివృద్ధిపై సవతి తల్లి ప్రేమ చూపారని, బీఆర్‌ఎస్‌ హయాంలో అభివృద్ధి లేకుండా పోయిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సుల్తానాబాద్‌ రూపురేఖలు మార్చామని, డబుల్‌ రోడ్లు నిర్మాణం చేశా మన్నారు. రూ.20 కోట్ల పనులు మంజూరు కాగా ఐదు కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఏడాది లోగా రోడ్ల నిర్మాణం పూర్తవుతాయని దీంతో సుల్తానా బాద్‌లో 90 శాతం అభివృద్ధి పూర్తవుతుందన్నారు.

ప్రస్తుతం మరో ఆరు కోట్ల రూపాయలు వెచ్చించి అంబేద్కర్‌ కూడలి, ఎంపీడీవో ఆఫీసు కూడలి వద్ద ఐలాండ్స్‌, డివైడర్ల నిర్మాణం చేపడతా మన్నారు. అలాగే సుల్తానాబాద్‌ పట్టణ ప్రజల తాగునీటి సమస్య పరిష్కరించేందుకు రూ.15 కోట్లతో అమృత్‌ 2.0 ద్వారా ట్యాంక్‌ నిర్మిస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని, పట్టణంలో పైప్‌లైన్లు వేస్తున్నా రని చెప్పారు. మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌రావు, కిసాన్‌ సెల్‌ మండల అధ్యక్షుడు పన్నాల రాములు, గాజుల రాజ మల్లు, శ్రీగిరి శ్రీనివాస్‌, బిరుదు కృష్ణ, మహేందర్‌, అబ్బ య్య గౌడ్‌, చిలుక సతీష్‌, రవీందర్‌, ఎండీ అమీనొద్దిన్‌, అమిరిశెట్టి రాజలింగం, పాల్గొన్నారు

Updated Date - Dec 24 , 2025 | 12:26 AM