Home » Sircilla
రామగుండం ప్రజల కల త్వరలోనే నెరవేరబోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సింగరేణి ఆధ్వ ర్యంలో జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన దసరా, దీపావళి-2025 ఉత్సవాలను ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూ ర్‌తో కలిసి ప్రారంభించారు.
బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శని వారం బంద్ విజయవంతమైంది. పెట్రోల్ బంక్‌లు, సినిమా థియేటర్లు, ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ పాటించాయి. మధ్యాహ్నం వరకు దుకాణాలు తెరుచు కోలే దు. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణ ప్రాంగణాలు వెలవెలబో యాయి. రాజకీయాలకు అతీతంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీసీ, కుల సంఘాల నాయకులు బంద్‌లో పాల్గొన్నారు.
మద్యం షాపుల టెండర్లకు వ్యాపారుల నుంచి స్పందన కరువైంది. 2023లో వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే దరఖాస్తులు తగ్గడం గమనార్హం. ఇందుకు రెండు లక్షల రూపాయలు ఉన్న దరఖాస్తు ఫారాన్ని మూడు లక్షలకు పెంచడం వల్లనే వ్యాపారులు ఆసక్తి చూపలేదని తెలుస్తుంది.
అభివృద్ధి పనులతో రామగుండానికి కొత్త రూపు సంతరించుకుందని ఎమ్మెల్యే రాజ్‌ఠా కూర్ పేర్కొన్నారు. శనివారం నగరపాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో రూ.5.73కోట్ల నిధులతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భూమిపూజ చేశారు.
విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని చదవాలని, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సునిత కుంచాల అన్నారు. శనివారం పెద్ద బొంకూరు మదర్‌థెరిస్సా ఇంజనీ రింగ్ కళాశాలలో న్యాయ సేవాధి కార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో శనివారం ఆర్జీ-2 జీఎం బండి వెంకటయ్య స్ట్రక్చర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఏరియాలో పలు సమస్యలను ఏఐటీయూసీ నాయకులు జీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఓసీపీ-3లోని సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ ఖాళీలను వీకేపీ గని నుంచి సీనియార్టీ ప్రాతిపదికన భర్తీ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
సుల్తానాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని నిర్వహిస్తున్న డంప్‌యార్డులో చెత్త చేరుకుపోయింది. ప్రాసె సింగ్ లేకపోవడంతో హైదరాబాద్‌లోని సీడీఎంఏకు ఫిర్యాదులు రావడంతో శుక్రవారం సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ సంధ్య డంప్‌యార్డును ఆకస్మి కంగా తనిఖీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డు లబ్ధిదారులకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేపడుతున్నది. సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో మిగిలిన దొడ్డు బియ్యాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని పలువురు రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు.
బీసీ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని పెగడపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కామారెడ్డి సభలో పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో ప్రకటించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్ ప్రకటించిందన్నారు.
సీపీఆర్ (కార్డియో పల్మనరీ రెసుసిటేషన్) పై అందరికి అవగాహన ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వి. వాణిశ్రీ తెలిపారు. కలెక్టరెట్‌లో శుక్రవారం అవగా హన కార్యక్రమం ఏర్పాటు చేశారు. డా. ప్ర శాంత్ సీపీఆర్ చేసే విధానాన్ని వివరించారు. అనంతరం పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయిం చారు.