Share News

కూనారం ఆర్వోబీ పనులు జూలైలోగా పూర్తిచేయాలి

ABN , Publish Date - Dec 31 , 2025 | 12:09 AM

కూనా రం ఆర్వోబీ నిర్మాణాన్ని జూలైలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశిం చారు. మంగళవారం కూనారం రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి, ఆర్‌అండ్‌బి అతిథిగృహం ప్రహరి పనులను పరిశీలిం చారు.

కూనారం ఆర్వోబీ పనులు జూలైలోగా పూర్తిచేయాలి

పెద్దపల్లిటౌన్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కూనా రం ఆర్వోబీ నిర్మాణాన్ని జూలైలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశిం చారు. మంగళవారం కూనారం రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి, ఆర్‌అండ్‌బి అతిథిగృహం ప్రహరి పనులను పరిశీలిం చారు. ఆయనమాట్లాడుతూ పెద్దపల్లి-కూనారం ఆర్వోబీ నిర్మాణానికి అవసరమైన పెండింగ్‌ భూ సేకరణ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. పనులు వేగవంతం చేయాలని, మార్చి నాటికి అండర్‌ పాస్‌ నిర్మాణ పనులు రైల్వేశాఖ పూర్తి చేయాలన్నారు. రైల్వే ఓవర్‌ బ్రిడ్జికి సంబంధించిన సర్వీస్‌ రోడ్డు పనులు సమాంతరంగా జరగాలని కలెక్టర్‌ తెలిపారు. ఆర్‌అండ్‌ బి అతిథి గృహం ప్రహరి, అవసరమైన ల్యాండ్‌ స్కేపిం గ్‌ పనులు చేపట్టాలని సూచించారు. అతిథిగృహం వద్ద వీఐపీలు బసచేసే సమయంలో భద్రత ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పనులలో వేగం పెంచాలని ఏప్రిల్‌ నాటికి జడ్పీ కార్యాలయం అం దుబాటులోకి తీసుకొని రావాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి రెవెన్యూ డివిజన్‌ అధికారి బి గంగయ్య, ఈఈ భావ్‌సింగ్‌, తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

పెద్దపల్లి రూరల్‌, (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి తహసీ ల్దార్‌ కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న జడ్పీ కార్యా లయ నిర్మాణ పనులు 4 నెలల్లో పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం నిర్మాణ పనులను పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకు న్నారు. జడ్పీ కార్యాలయం నిర్మాణ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని, పనుల్లో వేగం పెంచాలని ఏప్రిల్‌ నాటికి జడ్పీ కార్యాలయం అందుబాటులోకి రావా లని ఆదేశించారు. ఆర్డీవో గంగయ్య, ఆర్‌అండ్‌బి ఈఈ బావ్‌సింగ్‌, తహసీల్దార్‌ రాజయ్య, డిప్యూటీ తహసీల్దార్‌ విజేందర్‌ ఉన్నారు.

Updated Date - Dec 31 , 2025 | 12:09 AM