నర్సరీల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలి
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:08 AM
గ్రామాలలో కొత్త నర్సరీ ఏర్పాటు, ప్రస్తుత నర్సరీల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని దేవి అన్నారు. సుల్తానాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందికి శిక్షణ నిర్వహించారు.
సుల్తానాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): గ్రామాలలో కొత్త నర్సరీ ఏర్పాటు, ప్రస్తుత నర్సరీల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని దేవి అన్నారు. సుల్తానాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందికి శిక్షణ నిర్వహించారు.
ఈ సమావేశంలో 2026 - 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పంచాయతీలలో నర్సరీల నిర్వహణకు అటవీ శాఖచే శిక్షణ ఇచ్చామన్నారు. డీఆర్‌డీఓ మాట్లాడుతు కొత్త నర్సరీ ల ఏర్పాటుకు గ్రామాలలో స్థలాలను ఎంపిక చేసుకోవాలని, మట్టి నిల్వ లు సేకరించాలని, మొక్కల పెంపకానికి మొక్కలను సిద్ధం చేసుకోవాల న్నారు. రైతులు పశువుల కొట్టాలు, గొర్రెల మేకల పాకలకోసం కూడా ఈజీఎస్ ఆధికారులను ఆశ్రయించి లబ్ధిపొందాలన్నారు. ఎంపీడీఓ దివ్య దర్శన్ రావు, అటవీ శాఖ అధికారి మంగీలాల్ పాల్గొన్నారు.