Share News

2 నుంచి శానిటేషన్‌పై స్పెషల్‌ డ్రైవ్‌

ABN , Publish Date - Dec 31 , 2025 | 12:13 AM

రామగుండం నగరపాలక సంస్థలో 2 నుంచి 11వరకు శానిటేషన్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్‌ అరుణశ్రీ చెప్పారు. మంగళవారం అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

2 నుంచి శానిటేషన్‌పై స్పెషల్‌ డ్రైవ్‌

కోల్‌సిటీ, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థలో 2 నుంచి 11వరకు శానిటేషన్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్‌ అరుణశ్రీ చెప్పారు. మంగళవారం అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ స్పెషల్‌ డ్రైవ్‌లో సిబ్బందిని ఉపయోగించుకుని ఆయా ప్రాంతాల్లో మురుగునీటి కాలువల పూడిక, పిచ్చిమొక్కలు, ముళ్ల పొదల తొలగింపు, వీధులు ఊడ్చడం, చెత్తకుప్పలు ఎత్తడం, పాయింట్‌ క్లియరెన్స్‌ చేయడం, ప్లాస్టిక్‌ నిషేధం ఉల్లంఘించిన వారికిపై జరిమానాలు విధిస్తామన్నారు. అడిషనల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌, ఎస్‌ఈ గురువీర్‌, ఈఈ రామన్‌, డీసీ వెంకటస్వామి, సెక్రటరీ ఉమామహేశ్వర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీహరి, ఆర్‌ఓ ఆంజనేయులు, డీఈ శాంతి స్వరూప్‌, ఏఈ జమీల్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నాగభూషణం, సంపత్‌, మెప్మా టీఎంసీ మౌనిక, సీఓలు, వార్డు అధికారులు, జవాన్లు, వార్డు అసిస్టెంట్లు పాల్గొన్నారు.

పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు

రామగుండం నగరపాలక సంస్థలో నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్‌ అరుణశ్రీ హెచ్చరించారు. రూ.1.8కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో మల్కాపురంలోని స్లాటర్‌ హౌస్‌ రీమోడలింగ్‌, ఎఫ్‌ఎస్‌టీపీలకు అప్రొచ్‌రోడ్డు నిర్మాణ పనులను ఒప్పందం ప్రకారం గడువులోగా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్‌కు నోటీసు అందించామని, నోటీసులకు స్పందించి పనులను ప్రారంభించని పక్షంలో సదరు కాంట్రాక్టర్‌లను చట్ట ప్రకారంగా బ్లాక్‌లిస్టులో చేరుస్తామని, నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేసి నగర అభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు.

Updated Date - Dec 31 , 2025 | 12:13 AM