ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:10 AM
ప్రజావాణి అర్జీలను సత్వ రమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీక రించారు.
పెద్దపల్లిటౌన్, డిసెంబరు 29 (ఆంఽధ్రజ్యోతి): ప్రజావాణి అర్జీలను సత్వ రమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీక రించారు. పెద్దపల్లి పట్టణం ఉదయనగర్‌కు చెందిన ఎన్. జ్యోతి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసిం గ్‌కు రాశారు. కమాన్‌పూర్ మండలం గుండారం చెందిన ఎన్.కాంతమ్మ రాజయ్య దంపతులు తమ పెద్ద కుమారుడు, కోడలు చూడడం లేదని, పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు కేసులు పెడుతున్నారని దరఖాస్తు చేసుకోగా జిల్లా సంక్షేమ అధికారికి రాస్తూ చర్యలు తీసుకోవాలన్నారు పాలకుర్తి మండలం రామారావుపల్లె గ్రామానికి చెందిన మల్లమ్మ ప్రభుత్వం తమ కు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని, పునాది వరకు ఇంటి నిర్మా ణం పూర్తి చేసుకున్నామని, బిల్లులు మంజూరు కావడం లేదని, తమ బిల్లు ఇప్పించాలని దరఖాస్తు చేసుకోగా పిడి హౌసింగ్ రాశారు.
రామగిరి, (ఆంధ్రజ్యోతి): కల్వచర్ల గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో ఇసుక డంప్‌ల నిల్వలపై ప్రజావాణిలో బీఆర్‌ఎస్ నాయకుడు బొంకూరి పోచం ఫిర్యాదు చేశాడు. దీంతోపాటు కల్వచర్ల బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన శిలాఫలకం తొలగించాలని పేర్కొన్నారు. అధికారులు ఏడి మైనింగ్‌కు చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు.