స్వచ్ఛ పాఠశాలలకు అవార్డుల ప్రదానం
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:06 AM
జిల్లాలోని ఎనిమిది పాఠశాలలకు స్వచ్ఛ పాఠశాలల అవార్డును ప్రదానం చేసినట్లు కలెక్టర్ కోయశ్రీహర్ష తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో స్వచ్ఛత అంశంలో ఉత్తమ పనితీరు కనబరిచిన 8 పాఠశాలలకు జిల్లాస్థాయి అవార్డులు, ప్రశంసాపత్రాలను ఆయన అందించారు.
పెద్దపల్లి కల్చరల్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఎనిమిది పాఠశాలలకు స్వచ్ఛ పాఠశాలల అవార్డును ప్రదానం చేసినట్లు కలెక్టర్ కోయశ్రీహర్ష తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో స్వచ్ఛత అంశంలో ఉత్తమ పనితీరు కనబరిచిన 8 పాఠశాలలకు జిల్లాస్థాయి అవార్డులు, ప్రశంసాపత్రాలను ఆయన అందించారు. ఈ మేరకు పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో స్వచ్ఛ పాఠశాల కింద ఆరు ముఖ్యాంశాలలో స్వీయ మదింపు నిర్వహించుకున్నాయని తెలిపారు.
ఇందులో ప్రధానంగా తాగునీటి వసతి, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ, విద్యార్థుల చేతులు శుభ్రానికి సౌకర్యాలు, పాఠశాల పరిశుభ్రత, పరిసరాల పరి శుభ్రతపై విద్యార్థుల ప్రవర్తన అవగాహన, మిషన్ లైఫ్ కార్యక్రమాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. డీఈవో శారద, ఏఎంవో షేక్, సీఎంఓ కవిత, ప్రధానోపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.