Share News

వ్యక్తిగత దూషణలు సరికాదు

ABN , Publish Date - Dec 31 , 2025 | 12:12 AM

అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి శ్రీధర్‌బాబు నియోజకవర్గ ప్రజలకు, మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై మాజీ ఎమ్మెల్యేగా ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ నేతలు తనను వ్యక్తిగతంగా దూషించేలా మంత్రితోపాటు ఆయన సోదరుడు వారిని ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ధ్వజమెత్తారు.

వ్యక్తిగత దూషణలు సరికాదు

మంథని, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి శ్రీధర్‌బాబు నియోజకవర్గ ప్రజలకు, మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై మాజీ ఎమ్మెల్యేగా ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ నేతలు తనను వ్యక్తిగతంగా దూషించేలా మంత్రితోపాటు ఆయన సోదరుడు వారిని ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ధ్వజమెత్తారు. మంగళవారం అంబేద్కర్‌ చౌక్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తన పై వ్యక్తిగతంగా కాంగ్రెస్‌ నేతలు దూషణలకు దిగితే దుద్దిళ్ళ కుటుంబ చరిత్ర అంతా ప్రజల ముందు బహిర్గతం చేస్తానని మండిపడ్డారు.. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని, ఇసుకల లారీలను బంద్‌ చేస్తానని, పరిశ్రమలు స్థాపిస్తానని, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానని హామీలను ప్రజలకు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు.

అధికారంలోకి వచ్చి రెండు ఏళ్ళు గడిచిన హామీలను అమలు చేయకపోవడంతో తాను ప్రశ్నిస్తే తన దుద్దిళ్ళ సోదరులు అనుచరులతో వ్యక్తిగత దూషణలు చేయించి సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి వాటికి, పోలీసు కేసులకు తాను భయడనన్నారు. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న శ్రీధర్‌బాబును తానే రాజకీయాల్లోకి తీసుకు వచ్చానని, ఎమ్మెల్యేగా గెలుపు కోసం కీలకంగా పని చేశానన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. భూపాలపల్లి మాజీ జెడ్పీ చైర్మన్‌ జక్కు శ్రీహర్ష-రాకేష్‌, నేతలు తగరం శంకర్‌లాల్‌, మాచీడి రాజుగౌడ్‌, ఏగోళపు శంకర్‌గౌడ్‌, మిర్యాల ప్రసాద్‌రావు, గొబ్బూరి వంశీ, కనవేన శ్రీను, జంజర్ల శేఖర్‌, కుమార్‌లు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2025 | 12:12 AM