Share News

విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:46 PM

రాష్ట్రంలో విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు స్పష్టం చేశారు. ఆదివారం శివపల్లిలోని ఆయన స్వగృహంలో టీఆర్‌టీఎఫ్‌ జిల్లా శాఖ క్యాలండర్‌, డైరీని ఆయన ఆవిష్కరించారు.

విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

ఎలిగేడు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు స్పష్టం చేశారు. ఆదివారం శివపల్లిలోని ఆయన స్వగృహంలో టీఆర్‌టీఎఫ్‌ జిల్లా శాఖ క్యాలండర్‌, డైరీని ఆయన ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని కొనియాడారు. ఉపాధ్యాయులు అంకితభావం, ప్రజాప్రతినిధుల సహకారంతో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం విద్యతోపాటు విద్యార్థులకు కావా ల్సిన మౌలిక వసతులు, హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం, దుస్తులు కల్పించడంపై ఉపాధ్యా యులు చొరవ తీసుకోవాలన్నారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు, కేజీ నుంచి పీజీ వరకు ఉన్నత విద్యాభ్యాసం బడుగు బలహీనవర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య, ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. ఉపాధ్యా యుల సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు టీఆర్‌టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్‌ మాట్లాడుతూ జిల్లాలో మూతపడే స్థితిలో ఉన్న పాఠశాలలను తిరిగి తెరిపించడంలో ఎమ్మెల్యే చూపు తున్న చొరవ అభినందనీయమన్నారు. మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్‌, రాష్ట్ర కన్వీనర్‌ ప్రభాకర్‌రావు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌, టీఆర్‌టీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్‌ కుమార్‌, రాష్ట్ర నాయకులు రవి కుమార్‌, మహేందర్‌ రెడ్డి, అశోక్‌ కుమార్‌, శ్రీనివాస్‌, జిల్లా నాయకులు రవీందర్‌ రావు, విటల్‌, ప్రేమ్‌సాగర్‌, మహేష్‌ కుమార్‌, రమేష్‌, కరుణాకర్‌రెడ్డి, నాగరాజు, లక్ష్మినారాయణ, రమేష్‌, మహేందర్‌, దస్తగిరి పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 11:46 PM