Share News

ప్రమాదంలో గాయపడిన విద్యార్ధినికి చేయూత

ABN , Publish Date - Dec 31 , 2025 | 12:16 AM

ఇటీవల బస్సు ప్రమాదంలో గాయపడిన ఇంటర్మీడియట్‌ విద్యార్థిని పడాల మేఘనకు గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల చేయూతనిచ్చింది. తోటి విద్యార్థినులు, అధ్యాపకులు విరాళంగా సేకరించిన రూ. 50వేలను నగదును మంగళవారం కళాశాల ఆవరణలో జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారిణి, ప్రిన్సిపల్‌ డి.కల్పన చేతులమీదుగా విద్యార్థినీ తల్లిదండ్రులకు అందజేశారు.

ప్రమాదంలో గాయపడిన విద్యార్ధినికి చేయూత

కోల్‌సిటీటౌన్‌, డిసెంబర్‌ 30(ఆంధ్రజ్యోతి): ఇటీవల బస్సు ప్రమాదంలో గాయపడిన ఇంటర్మీడియట్‌ విద్యార్థిని పడాల మేఘనకు గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల చేయూతనిచ్చింది. తోటి విద్యార్థినులు, అధ్యాపకులు విరాళంగా సేకరించిన రూ. 50వేలను నగదును మంగళవారం కళాశాల ఆవరణలో జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారిణి, ప్రిన్సిపల్‌ డి.కల్పన చేతులమీదుగా విద్యార్థినీ తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తోటి విద్యార్థినికి ప్రమాదానికి గురైతే తోటి విద్యార్థులు చేయూతనివ్వడం అభినందనీయమన్నారు. మేఘన ఆరోగ్యం మెరుగు కావడానికి ప్లాస్టిక్‌ సర్జరీ కొరకు దాతలు సహాయం చేసి మేఘనకు ఆర్థిక మానసిక స్థైర్యం పెంచాలని కోరారు. విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2025 | 12:16 AM