Share News

మున్సిపల్‌ ఎన్నికలకు కసరత్తు

ABN , Publish Date - Dec 30 , 2025 | 12:14 AM

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు అధికార యత్రాంగం సన్నద్ధమవు తోంది. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరే షన్‌లలో ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమేనని ఈ నెల 27న మున్సిపల్‌ డైరెక్టర్‌ శ్రీదేవి రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టింది.

మున్సిపల్‌ ఎన్నికలకు కసరత్తు

కోల్‌సిటీ, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు అధికార యత్రాంగం సన్నద్ధమవు తోంది. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరే షన్‌లలో ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమేనని ఈ నెల 27న మున్సిపల్‌ డైరెక్టర్‌ శ్రీదేవి రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్‌స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితాకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇందులో డిసెంబర్‌ 30వ నుంచి 2026 జనవరి 10వ తేదీ వరకు షెడ్యూల్‌ ప్రకటించింది. జిల్లాలోని రామగుండం నగరపాలక సంస్థతోపాటు పెద్దపల్లి, మం థని, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగ నున్నాయి. ఈ మూడు మున్సిపాలిటీలకు పాలకవర్గాల గడువు పూర్తయి ఏడాది అయ్యింది. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రకటనకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అక్టోబరు 1, 2025 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సిద్ధం చేసిన ఓటర్ల జాబితా అనుగుణంగానే ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలోని రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని 60డివిజన్లు, పెద్దపల్లి మున్సిపాలిటీలోని 36వార్డులు, మంథని మున్సిపాలిటీలో 13వార్డులు, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలో 15వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎస్‌సీ, ఎస్‌టీ రిజర్వేషన్లకు సంబంధించి 2011 జనాభా లెక్కలనే పరిగణలోకి తీసు కుంటారు. బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానాన్నే అవలం భించనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రామ గుండం నగరపాలక సంస్థ జనాభా 2,37,636గా ఉన్నది. ఇందులో ఎస్‌టీ జనాభా 4278, ఎస్‌సీ జనాభా 50,744గా ఉంది. పెద్దపల్లిలో 50762 జనాభా ఉండగా, ఎస్‌టీలు 312, ఎస్‌సీ జనాభా 4527గా ఉన్నది. అలాగే సుల్తానాబాద్‌లో 19,772 జనాభా ఉండగా ఎస్‌టీ జనాభా 309, ఎస్‌సీ జనాభా 2561గా ఉన్నది. మంథనిలో 18282జనాభా ఉండగా ఎస్‌టీలు 208, ఎస్‌సీలు 2513గా ఉన్నారు.

ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన షెడ్యూల్‌

ఈనెల 30: పోలింగ్‌ స్టేషన్ల జాబితా ప్రకటన

ఈనెల 31: వార్డుల వారీగా పోలింగ్‌ స్టేషన్ల జాబితా ప్రకటన

ఈనెల 31: పోలింగ్‌ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితా ప్రకటన

జనవరి 1: పోలింగ్‌స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితా డ్రాప్టు విడుదల, అభ్యంతరాల స్వీకరణ

జనవరి 5: మున్సిపాలిటీల వారీగా గుర్తించిన రాజకీయ పక్షాలతో సమావేశం

జనవరి 6: జిల్లాలో రాజకీయ పక్షాలతో సమావేశం

జనవరి 10: పోలింగ్‌ కేంద్రాల వారీగా తుది ఓటర్ల జాబితా ప్రకటన

Updated Date - Dec 30 , 2025 | 12:14 AM