Share News

బీసీ సంక్షేమ సంఘం పటిష్టతకు కృషి చేయాలి

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:48 PM

బీసీ సంక్షేమ సంఘం పటిష్టత, బలోపేతమే లక్ష్యంగా ప్రతీ బీసీ నాయకుడు కృషి చేయాలని తెలం గాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కందుల సదాశివ్‌ కోరారు. ఆది వారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యవర్గాన్ని ప్రకటించారు.

బీసీ సంక్షేమ సంఘం పటిష్టతకు కృషి చేయాలి

పెద్దపల్లి టౌన్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): బీసీ సంక్షేమ సంఘం పటిష్టత, బలోపేతమే లక్ష్యంగా ప్రతీ బీసీ నాయకుడు కృషి చేయాలని తెలం గాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కందుల సదాశివ్‌ కోరారు. ఆది వారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా కాసగోని నిర్మలాదేవి గౌడ్‌, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా జునుగారి సుధాకర్‌, జిల్లా యూత్‌ ప్రెసిడెంట్‌ గా తమ్మెడబోయిన రాజ్‌కుమార్‌ యాదవ్‌లను నియమిస్తూ పత్రాలను అందజే శారు. సదాశివ్‌ మాట్లాడుతూ బాధ్యతలు స్వీకరించిన జిల్లా కార్యవర్గ సభ్యులు బీసీల హక్కులు, సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలన్నారు. బీసీల సమస్యల పరిష్కారానికి సంఘం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సిరవేన స్వప్న, ప్రధాన కార్యదర్శి చర్లపల్లి సురేష్‌ గౌడ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్‌ పటేల్‌, సలహాదారులు డాక్టర్‌ మంద భాస్కర్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 11:48 PM