Home » Sircilla
రైతులు ఎదురు చూస్తున్న యాసంగి సన్నరకం ధాన్యానికి బోనస్ డబ్బు లు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఎమ్మెల్యే విజయరమ ణారావు అన్నారు. గురువారం పొత్క పల్లిలో మార్క్‌ఫెడ్ కేంద్రంతోపాటు ధాన్యం కొను గోలు కేంద్రాలను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, అద నపు కలెక్టర్ వేణుతో కలిసి ప్రారం భిం చారు.
జిల్లాలో మద్యం షాపులకు టెండర్ల దాఖలు గడువు గురువారం నాటితో ముగిసింది. మొత్తం 74 మద్యం షాపులకుగాను 1471 దరఖాస్తులు వచ్చాయి. వీటి రూపేణా ప్రభుత్వానికి 44 కోట్ల 13 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు బంధంపల్లిలోని స్వరూప గార్డెన్లో డ్రా పద్ధతిన లైసెన్స్‌దారులను ఎంపిక చేయనున్నారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా, చేయమని అడిగినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి వాణిశ్రీ హెచ్చరించారు. గురువారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని రేడియాలజీ, గైనిక్ విభాగంలో స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.
సింగరేణి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్) కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందుపై ప్రభుత్వం వేటు వేసింది. ఆమెను ప్రిన్సిపాల్ విధుల నుంచి తప్పిస్తూ వైద్యశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీఓ 500విడుదల అయ్యింది. హిమబిందు స్థానంలో అదే కళాశాలలో బయో కెమిస్ర్టి ప్రొఫెసర్ నరేందర్‌ను ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా నియమించారు.
విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని, ప్రజలకు సేవలందించడానికి, శాంతి భద్రతల పరిరక్షణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పోలీస్‌శాఖ ముందుకు వెళుతుందని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తెలంగాణ సస్యశ్యామలం అయ్యిందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పట్టణంలోని ఎస్సారెస్పీ క్యాంప్ కార్యాలయం చుట్టు రూ.28.64 లక్షలతో నిర్మించ తలపెట్టిన ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
ఉమ్మడి జిల్లాలోని యాద వులకు ఈనెల 24న ఒక రోజు రాజకీయ శిక్షణ శిబిరం నిర్వ హిస్తున్నట్లు యాదవ సంఘ జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేష్ తెలి పారు. మండల కేంద్రంలో అఖిల భారత యాదవ మహాసభ మం డల ఉపాధ్యక్షుడు జిల్లా కనుకన్న అధ్యక్షతన జరిగిన సమావేశం అనం తరం విలేకరులతో మాట్లాడారు.
జిల్లాలో దీపావళి వేడుకలను ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకలను సోమ, మంగళవారాల్లో ఘనంగా జరుపుకున్నారు. దీపావళిని పురస్కరించుకొని ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలతో పాటు ఇండ్లలో, షాపుల్లో ధన లక్ష్మీ పూజలను నిర్వహించారు.
రిజర్వేషన్ల ప్రక్రియ కేంద్ర ప్రభు త్వం చేస్తున్న ద్వంద విధానాలను వ్యతిరేకిస్తూ ఆదివారం ఆర్జీ-3 డివిజన్ పరిధిలోని సెంటినరీకాలనీలో సిఐటియు(సిపిఐ) ఆధ్వర్యంలో నల్లజెండాల తో నిరసన ర్యాలీ చేపట్టారు. జిల్లా కార్యదర్శి ముత్యంరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్ల కల్పించాలని తీర్మానం ప్రవేశపెట్టి గవర్నర్‌కు పంపినా ఆమోదం తెలుపలేదన్నారు.
రామగుం డం నియోజకవర్గంలో ఎవరెన్ని కుట్రలు చేసినా అభి వృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ హెచ్చరించారు. ఆదివారం గోదావరిఖని బస్టాండ్ వద్ద చిరు వ్యాపారుల కోసం నిర్మించిన వాణిజ్య, వ్యాపార సంస్థలను ఆయన ప్రారంభించారు.