గౌడ కులస్థులకు ఉపాధికి భూమి కేటాయించాలి
ABN , Publish Date - Dec 31 , 2025 | 10:56 PM
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గౌడ కులస్థులకు ఉపాధి కల్పించేలా సింగరేణి భూములను కేటాయించా లని కాలనీ గౌడ సంక్షేమ సంఘం నాయకులు డిమాం డ్ చేశారు.
యైుటింక్లయిన్‌కాలనీ, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గౌడ కులస్థులకు ఉపాధి కల్పించేలా సింగరేణి భూములను కేటాయించా లని కాలనీ గౌడ సంక్షేమ సంఘం నాయకులు డిమాం డ్ చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో సం ఘం అధ్యక్షుడు నాచగోని దశరథంగౌడ్ మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ గౌడ కులస్థుల సమస్యలను ప్రస్తావించడంపై కృతజ్ఞతలు తెలిపారు. తాటి, ఈత వనాల కోసం సింగరేణి, ఎన్‌టీ పీసీ సంస్థలకు చెందిన నిరుపయోగంగా ఉన్న భూమిలో 40 ఎకరాలు కేటాయించా లని ఎమ్మెల్యే సూచనను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మక్కాన్‌సింగ్ చిత్రపటానికి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. దాసరి శ్రీనివాస్, సత్యనారాయణ, శ్రీనివాస్, బండి వెంకట్రాజం, రాజు, సురేష్‌గౌడ్, బాలు గౌడ్, యాదగిరి, శ్రీకాంత్ పాలొన్నారు.