Share News

సీపీఐ శతాబ్ది సభను విజయవంతం చేయండి

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:05 AM

సీపీఐ వంద వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 18న ఖమ్మంలో నిర్వహించే విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు రాష్ట్రకార్యవర్గ సభ్యుడు గౌతమ్‌ గోవర్ధన్‌ తెలిపారు. శనివారం ఖేల్‌మహేంద్ర భవన్‌లో మండల సెక్రటరీ జూపాక రాంచందర్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

సీపీఐ శతాబ్ది సభను విజయవంతం చేయండి

రామగిరి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): సీపీఐ వంద వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 18న ఖమ్మంలో నిర్వహించే విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు రాష్ట్రకార్యవర్గ సభ్యుడు గౌతమ్‌ గోవర్ధన్‌ తెలిపారు. శనివారం ఖేల్‌మహేంద్ర భవన్‌లో మండల సెక్రటరీ జూపాక రాంచందర్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాల వారీగా సీపీఐ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ నెల 10న పెద్దపల్లిలో సభను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సభలకు పెద్దసంఖ్యలో రైతులు, అన్ని వర్గాల కార్మికులు ప్రజలు హజరు కావాలని పిలుపునిచ్చారు. ఉపాధిహామీలో గాంధీ పేరును మార్చడాన్ని వ్యతిరేకించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభు త్వాల ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచే విధంగా కుట్ర చేస్తుందని ఆరోపిం చారు. గతంలో వంద రోజుల పనిదినాలకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేదన్నారు. అందుకు భిన్నంగా 60 శాతం కేంద్రం, రాష్ట్రం 40 శాతం నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాల పై ఆర్థిక భారం మోపుతోందని ఆరోపించారు. ఈజీఎస్‌ పనులను పాత పద్ధ తిలో కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. సదానందం, ప్రకాశ్‌, రాజర త్నం, మొండయ్య, కనకయ్య, సాంబశివరెడ్డి, రాజయ్య, కొమురయ్య, జగదీష్‌, ధర్మయ్య, రాజలింగయ్య, నవీన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 12:05 AM