వైద్యులు సమయపాలన పాటించాలి
ABN , Publish Date - Dec 31 , 2025 | 10:47 PM
వైద్యులు సమయపాలన పాటించాలని, విధులను సక్రమంగా నిర్వహిచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యులకు సూచించారు. బుధవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ క్రిటికల్ కేర్, సర్జరీ బ్లాక్‌లు, ఆర్థోపెడిక్, జనరల్ వార్డులను పరిశీలించారు.
కళ్యాణ్‌నగర్, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): వైద్యులు సమయపాలన పాటించాలని, విధులను సక్రమంగా నిర్వహిచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యులకు సూచించారు. బుధవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ క్రిటికల్ కేర్, సర్జరీ బ్లాక్‌లు, ఆర్థోపెడిక్, జనరల్ వార్డులను పరిశీలించారు. అనం తరం ఆయన మాట్లాడుతూఆసుపత్రికి వచ్చే రోగులపై వైద్యులు, వైద్య సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ప్రభుత్వా సుపత్రికి వచ్చే రోగుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని, కొందరు వైద్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, విధి నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. క్రిటికల్ కేర్ భవనంతోపాటు పాత బిల్డిం గ్‌లో ఆధునికీకరణ పనులను వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ దయాల్‌సింగ్, ఆర్‌ఎంఓలు కృపాభాయ్, రాజు ఉన్నారు.