దుద్దిళ్ళ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం
ABN , Publish Date - Dec 31 , 2025 | 10:51 PM
మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు కుటుంబ సభ్యులపై మరోసారి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహిం చేది లేదని పలువురు కాంగ్రెస్ నేతలు వెల్లడిం చారు.
మంథని, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు కుటుంబ సభ్యులపై మరోసారి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహిం చేది లేదని పలువురు కాంగ్రెస్ నేతలు వెల్లడిం చారు. అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. దుద్దిళ్ళ కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా పుట్ట మధు చేసిన ఆరోపణలను వారు ఖండించారు. రాజ కీయ భిక్ష పెట్టిన ప్రజాప్రతినిధిగా పలు మార్లు అవకాశం కల్పించిన ఘనత ఆ కుటుంబాని దేనని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ నేతలు ఎక్కడైనా మధు కుటుంబ సభ్యులపై ఆరోప ణలు చేశారా అని ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృత్తం అయితే తగిన గుణపాఠం చెప్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు కుడు దుల వెంకన్న, రాజు, డివిజన్‌లోని నేతలు ఐలి ప్రసాద్, శశిభూషణ్‌కాచే, వొడ్నాల శ్రీనివాస్, పెండ్రు రమ-సురేష్‌రెడ్డి, ఇనుగంటి భాస్కర్ రావు, వనం రాంచందర్‌రావు, చొప్పరి సదానం దం, నాగినేని జగన్మోహన్‌రావు, దేవక్క, కొము రయ్యగౌడ్, కిరణ్‌గౌడ్, సత్యం, ఎరులక ప్రవీణ్, మద్దెల ఓదెలు, తిరుపతిలు పాల్గొన్నారు.