Share News

ఆర్‌జీ-1లో 90శాతం బొగ్గు ఉత్పత్తి

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:40 PM

ఆర్‌జీ-1లో డిసెం బరులో 4.47లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికిగాను 3.62లక్షల టన్నుల ఉత్పత్తితో 90శాతం సాధించిందని జీఎం లలిత్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం జీఎం కార్యాలయంలో నిర్వహిం చిన సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు 33.2లక్షల టన్నులకుగాను 29.62లక్షల టన్నులను సాధించిందని, రూ.3లక్షల టన్నులు వెనుకబడిందన్నారు.

ఆర్‌జీ-1లో 90శాతం బొగ్గు ఉత్పత్తి

గోదావరిఖని, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ఆర్‌జీ-1లో డిసెం బరులో 4.47లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికిగాను 3.62లక్షల టన్నుల ఉత్పత్తితో 90శాతం సాధించిందని జీఎం లలిత్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం జీఎం కార్యాలయంలో నిర్వహిం చిన సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు 33.2లక్షల టన్నులకుగాను 29.62లక్షల టన్నులను సాధించిందని, రూ.3లక్షల టన్నులు వెనుకబడిందన్నారు. నిర్దే శించిన లక్ష్యాన్ని మార్చి వరకు చేధించేందుకు ఉద్యోగులు, అధి కారులు కష్టపడి పని చేయాలని సూచించారు. కార్మికుల సం క్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టు, రూ.1.59కోట్ల సీఎస్‌ఆర్‌ నిధు లతో రాజీవ్‌ రహదారి వెంట 24కిలోమీటర్ల మేర మొక్కలు నాటామని, గోదావరినది వద్ద ఉన్న సమ్మక్క-సారలమ్మ జా తర ప్రాంగణ అభివృద్ధికి రూ.3.5కోట్లు కేటాయించినట్టు తెలి పారు. 533క్వార్టర్లు నిర్మించడానికి అనుమతులు వచ్చాయని, వాటి పనులను త్వరలోనే చేపడుతామని చెప్పారు. జీఎం ఆఫీస్‌లో మహిళల కోసం రూ.13లక్షలతో క్రెచ్‌ను ప్రారంభించా మన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఓటూ జీఎం చంద్ర శేఖర్‌, ఏజీఎం ఆంజనేయులు ఏసీఎంఓ అంబిక, డీజీఎంలు వర ప్రసాద్‌, కరుణ, జితేందర్‌సింగ్‌, ధనలక్ష్మిభాయ్‌, రమేష్‌, సెక్యూరిటీ ఆఫీసర్‌ వీరారెడ్డి, జీఎం పర్సనల్‌ రవీందర్‌రెడ్డి, వేణు, పీఓలు శ్రావణ్‌కుమార్‌, హనుమంతరావు, బ్రహ్మాజీ, నారాయణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 11:40 PM